భోజన ప్రియులకి పండగే.. మనదగ్గరే మొట్టమొదటి 7 స్టార్ హోటల్‌..

By Ashok kumar Sandra  |  First Published Jan 18, 2024, 9:13 PM IST

జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్యపై పట్టు కొనసాగించేందుకు పెద్ద పెద్ద హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో ప్రపంచంలోనే తొలి శాకాహార 7 స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
 


అయోధ్య: ఈ నెల జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యలో ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు బడా బడా హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహార 7 స్టార్ హోటల్‌ను నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది.

రామ మందిర ప్రారంభోత్సవం అయోధ్య నగరంలో అభివృద్ధి కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించింది. అయోధ్యను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు హోటళ్లు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా అయోధ్యను ప్రధాన వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Latest Videos

భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా శాఖాహారం మాత్రమే అందించే 7 స్టార్ హోటల్ లేదు. అయితే ఆ విధంగా అయోధ్యలో ఈ 7 స్టార్ హోటల్ నిర్మిస్తే తొలి శాఖాహార 7 స్టార్ హోటల్ అవుతుంది. అంతేకాకుండా, సరయు నది ఒడ్డున అనేక ఫైవ్ స్టార్ హోటళ్లు వస్తున్నాయి. దాదాపు 110 మంది చిన్న, పెద్ద హోటళ్ల వ్యాపారులు అయోధ్యలో  హోటళ్లను ఏర్పాటు చేసేందుకు భూమిని కొనుగోలు చేశాయి.

ముంబై, ఢిల్లీ ఇంకా  ఇతర ప్రధాన నగరాలను కలుపుతూ కొత్త విమానాశ్రయం అలాగే అప్‌గ్రేడ్ చేసిన రైల్వే స్టేషన్ ఇప్పటికే నగరంలో రన్ అవుతున్నాయి. శుక్రవారం నుంచి లక్నో నుంచి హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సోలార్ పార్క్ కూడా నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ ఆలయానికి 15 నిమిషాల దూరంలో ఉన్న 'ది సరయు' అనే పోష్ ఎక్స్‌క్లేవ్‌లో భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం మీద రామమందిర నిర్మాణంతో అయోధ్య చిత్రం పూర్తిగా మారిపోనుంది. 

click me!