జియో రిపబ్లిక్ డే ఆఫర్ : నెట్, కాల్స్, స్విగ్గి & షాపింగ్ డిస్కౌంట్స్ అన్ని కూడా..

By Ashok kumar Sandra  |  First Published Jan 18, 2024, 8:51 PM IST

సంవత్సరానికి  రూ. 2,999 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, ప్రజలు అనేక ప్రయోజనాలను పొందుతారు.  రూ. 299 కొనుగోళ్లపై రూ. 125 విలువైన 2 స్విగ్గీ కూపన్‌లను పొందుతారు. ఈ ప్లాన్ విమానాల చార్జెస్ పై రూ. 1,500 డిస్కౌంట్ కూడా అందిస్తుంది.


దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో రిపబ్లిక్ డే 2024 సందర్భంగా భారతదేశంలోని వినియోగదారుల కోసం కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2,999 ఇంకా 2.5GB డైలీ 4G డేటా, ఆన్ లిమిటెడ్  కాలింగ్, 365 రోజుల వాలిడిటి  అందిస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు Swiggy,  Ajio కూపన్‌లు, Ixigo ద్వారా ఫ్లయిట్ టికెట్స్ పై డిస్కౌంట్‌లు & Reliance Digitalలో సెలెక్ట్ చేసిన ఉత్పత్తులపై 10 శాతం తగ్గింపు వంటి బెనిఫిట్స్  పొందుతారు. 

జనవరి 31 వరకు జియో రిపబ్లిక్ డే ఆఫర్  

Latest Videos

జియో రిపబ్లిక్ డే 2024 ఆఫర్

సంవత్సరానికి  రూ. 2,999 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, ప్రజలు అనేక ప్రయోజనాలను పొందుతారు.  రూ. 299 కొనుగోళ్లపై రూ. 125 విలువైన 2 స్విగ్గీ కూపన్‌లను పొందుతారు. ఈ ప్లాన్ విమానాల చార్జెస్ పై రూ. 1,500 డిస్కౌంట్ కూడా అందిస్తుంది. (1 ప్యాక్స్‌పై రూ. 500, 2 ప్యాక్స్‌లపై రూ. 1,000, 3 ప్యాక్స్‌లపై రూ. 1,500). రూ. 500 విలువైన Ajio కూపన్‌ను కూడా పొందుతారు (కనీస ఆర్డర్ రూ. 2,499). ప్రీపెయిడ్ ప్లాన్   ఇతర ప్రయోజనాలు  పై రూ. 999 ఇంకా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై సెలెక్ట్ చేసిన ఉత్పత్తులపై 30 శాతం తగ్గింపు (రూ. 1,000 వరకు) అండ్ కనీస కొనుగోలు రూ. 5,000పై సెలెక్ట్  చేసిన ఉత్పత్తులపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.

ఇతర జియో ప్లాన్‌ల లాగానే  కొనుగోలుదారులు JioTV, JioCinema ఇంకా  JioCloud వంటి యాప్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు. ముఖ్యంగా, ఈ ప్లాన్‌తో జియోసినిమా ప్రీమియం అందుబాటులో ఉండదు.

ఆఫర్‌ను పొందడానికి, మీరు చేయాల్సిందల్లా Jio వెబ్‌సైట్‌కి వెళ్లి, రూ. 2,999 వార్షిక ప్లాన్‌తో మీ నంబర్‌ను రీఛార్జ్ చేయండి. కూపన్లు యూజర్  MyJio అకౌంట్  నుండి యాక్సెస్ చేయబడతాయి. Swiggy, Ajio ఇంకా మరిన్నింటిలో కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ కూపన్ కోడ్‌ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.

మరొక  నివేదిక ప్రకారం జియో  వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా తీసుకొచ్చింది, దీని ధర రూ.3,227. రీఛార్జ్ ప్లాన్ 2 GB డైలీ  డేటా, ఆన్ లిమిటెడ్ 5G డేటా, Amazon Prime వీడియో మొబైల్ ఎడిషన్, JioTV, JioCinema ఇంకా JioCloudకి ఉచిత 1-ఏడాది సబ్ స్క్రిప్షన్  యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

click me!