Gold Price Today: రికార్డు రేటు దిశగా బంగారం ధర, తులం బంగారం ధర ఎంత పెరిగిందే తెలిస్తే, కన్నీళ్లు ఆగవు..

Published : Feb 12, 2023, 10:26 AM IST
Gold Price Today: రికార్డు రేటు దిశగా బంగారం ధర, తులం బంగారం ధర ఎంత పెరిగిందే తెలిస్తే, కన్నీళ్లు ఆగవు..

సారాంశం

పసిడి ధరలు ప్రపంచ వ్యాప్తంగా పుంజుకున్నాయి. దీంతో ఆ ప్రభావం భారత్  పై కూడా పడింది. ఒక్క సారిగా దేశీయంగా పసిడి ధరలు 58000 దిశగా కదులుతున్నాయి. మరో వైపు పెళ్లిల్ల సీజన్ కూడా కొనసాగుతుండటంతో, బంగారు ఆభరణాలు చుక్కలను తాకుతున్నాయి. 

బంగారం కొనేవారికి ఇది నిజంగా  బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే పసిడి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకేలా పోటీ పడుతున్నాయి ముఖ్యంగా తులం బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుల వద్ద ట్రేడ్ అవుతుండగా.  మరో రెండు వందల రూపాయలు తాజాగా పెరగడంతో పసిడి ప్రియులకు నిరాశ పెంచుతోంది.  

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం పది గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 57,380 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ ధర రూ. 52,600గా పలుకుతోంది.  హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు అయిన,విజయవాడ,వరంగల్, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో ధరల విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,600 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,380 పలుకుతోంది. 

హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 72,700గా ఉంది. ఇదిలా ఉంటే బంగారం ధరను రోజురోజుకీ పెరిగిపోతున్నాయి దీని వెనక అంతర్జాతీయంగా కూడా కారణాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం దెబ్బ అన్ని దేశాలకు తగిలింది దీంతో ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా బంగారం వైపే నెమ్మదిగా కదులుతున్నాయి.  అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా చైనా యూరప్ మార్కెట్లలో కూడా బంగారం పైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది దీంతో అటు ఫ్యూచర్ మార్కెట్ తో పాటు రిటైల్ రంగంలో కూడా బంగారంపై డిమాండ్ పెరిగింది. 

 ఈ నేపథ్యంలో పసిడి ధరలను నియంత్రించడం ప్రభుత్వానికి అసాధ్యం అవుతుంది ముఖ్యంగా పసిడి ధరలు పసిడిని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పసిడి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది దీంతోనే పసిడి ధర మన దేశంలో ఎక్కువగా పలుకుతోంది.  అటు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే అమెరికాలో ఔన్స్ బంగారం ధర అంటే 31 గ్రాముల బంగారం ధర 1865 డాలర్లు పలుకుతోంది. అంటే దాదాపు 1,53,900 రూపాయలు పలుకుతోంది. 

అంతేకాదు బంగారం ధరలు రోజురోజుకీ పెరగడానికి ప్రధాన కారణం. అమెరికాలోని ద్రవ్యోల్బణం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ,  పసిడి పై ఇన్వెస్ట్మెంట్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.  దీంతో అక్కడ ఎన్నడూ లేనంతగా బంగారం ఔన్సు ధర 2000 డాలర్లకు దిశగా కొనసాగుతోంది. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే