రూ.5 వేలు, రూ.10 వేల నోట్లను ఎప్పుడైనా చూశారా? వాటిని ఎందుకు రద్దు చేశారంటే..

By Naga Surya Phani Kumar  |  First Published Oct 3, 2024, 12:29 PM IST

ఇండియాలో రూ.2000 నోట్ వచ్చినప్పుడు అందరూ ఆశ్యర్యపోయారు. ఎంత పెద్ద నోట్ అంటూ అందరూ మాట్లాడుకొనేవారు. అయితే భారతదేశంలో ఒకప్పుడు రూ.5000, రూ.10000 నోట్లు ఉండేవని మీకు తెలుసా? వాటిని తర్వాత రద్దు కూడా చేశారు. వీటిని రద్దు చేయడానికి ఉన్న కారణాలు, ఆ నోట్లు రన్నింగ్ లో ఉన్నప్పుడు కలిగిన ఉపయోగాలు, నష్టాలు వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 


భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో రూ.5000, రూ.10000 నోట్లు చలామణిలో ఉండేవి. 1954లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. వీటిని అప్పటి ఆర్థిక అవసరాల దృష్ట్యా పెద్ద మొత్తాల లావాదేవీల కోసం ఉపయోగించేవారు. పెద్ద వ్యాపారాలు, సంస్థలు, బ్యాంకులు ఎక్కువ మొత్తంలో డబ్బు మార్పిడి చేసుకునే సమయంలో ఈ నోట్లను వాడేవారు. రూ.5000, రూ.10000 నోట్లు 1954 నుండి 1978 వరకు చలామణిలో ఉండేవి. అయితే 1978లో ఈ నోట్లను ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించారు. దేశంలో అవినీతి, నల్లధనం పెరగడంతో ఆ నోట్లను రద్దు చేశారు. ఇంకో కారణం ఏంటంటే పెద్ద నోట్లు సామాన్య ప్రజలకు అవసరం లేకపోవడం, అధిక మొత్తంలో నల్లధనం నిల్వ చేయడం వంటి కారణాలతో ఈ నోట్లను రద్దు చేశారు. 

రూ.5000, రూ.10000 ఎందుకు రద్దు చేశారు

1978 జనవరిలో అప్పటి ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటంటే బ్లాక్ మనీని నిరోధించాలని, అవినీతి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద నోట్ల ద్వారా ఇల్లీగల్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

రూ.5000, రూ.10000 నోట్లను ప్రజలు ఎలా ఉపయోగించేవారు

Latest Videos

undefined

ఈ పెద్ద నోట్లు ఎక్కువగా పెద్ద వ్యాపార వేత్తలకు, బిజినెస్ సంస్థలకు ఉపయోగపడేవి. అప్పట్లో కాయిన్స్ ఎక్కువగా చలామణిలో ఉండేవి. దీంతో పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లడానికి ఎక్కువ ట్రాన్స్ పోర్ట్ అవసరం అయ్యేది. కాయిన్స్ కూడా పెద్ద పెద్ద మూటల్లో ప్యాక్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చేది. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. రూ.5 వేలు, రూ.10 వేల నోట్ల వల్ల వ్యాపార వేత్తలకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరిగేవి. సాధారణ ప్రజలు మాత్రం ఈ పెద్ద నోట్లు ఉపయోగించేవారు కాదు. ఆ కాలంలో తిండి సంపాదించడానికే సామాన్య ప్రజలు నానా అవస్థలు పడేవారు. ఇక వారు పెద్ద నోట్ చూడటమే గొప్ప విషయంగా ఉండేది. 

రూ.5 వేలు, రూ.10 వేల నోట్ల వల్ల ఇబ్బందులు

సామాన్య ప్రజలకు రూ.5 వేలు, రూ.10 వేల నోట్లు అస్సలు ఉపయోగపడేవి కావు. ఎందుకంటే ప్రజల అవసరాలన్నీ చిన్నగానే ఉండేవి. ప్రతి రోజు ఫుడ్ తినడమే కష్టంగా ఉండేది. దీంతో వారు పెద్ద నోట్లు ఉపయోగించేవారు కాదు. ఈ క్రమంలో ఆ నోట్లన్నీ కొంత మంది బడా వ్యాపార వేత్తల వద్దే నిల్వ ఉండిపోవడం ప్రారంభమైంది. దీంతో నల్లధనం పేరుకుపోతోందని అప్పటి ప్రభుత్వం భావించింది. అవినీతి ఎక్కువ కావడం, నేరగాళ్లు పెద్ద మొత్తంలో నల్లధనాన్ని నోట్ల రూపంలో దాచుకోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దేశంలో మనీ ఫ్లో తగ్గిపోయి పేదరికం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుంది. 

రూ.5000, రూ.10000 నోట్లు రద్దు చేసింది ఎవరు

రూ.5000, రూ.10000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1954లో మొదటిసారి ముద్రించింది. వీటిని భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు చలామణి చేసేవి. అవినీతి, నల్లధనం పెరిగిపోతోందన్న కారణంతో ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసి, ఆర్థిక వ్యవస్థను శుభ్రపరచడానికి ప్రయత్నించింది. 1978లో జనతా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ నేతృత్వంలో నల్లధనంపై నిరోధక చర్యగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రూ.2000 నోట్లు ఏమయ్యాయి

భారతదేశంలో రూ.2000 నోట్లు 2016లో అందుబాటులోకి వచ్చాయి. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని విడుదల చేసింది. దీని ద్వారా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం నల్లధనం, అవినీతిని అరికట్టడానికి, అక్రమ డబ్బు నిల్వలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని భావించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు. 

రూ.2000 నోట్ల ముద్రణ 2016లో ప్రారంభమైనప్పటికీ ఆర్బీఐ 2023 వరకూ ఈ నోట్లను చలామణిలో ఉంచింది. అయితే 2023 మే నాటికి దేశంలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ దాదాపు రూ.3.62 లక్షల కోట్లు అని అంచనా వేశారు. ఈ నోట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే 2018 తర్వాత ఆర్బీఐ ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది.

రూ.2 వేల నోట్లు కూడా రద్దు చేశారా?

2023 మే 19న రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని ప్రకటించింది. చిన్న నోట్లతో వీటిని మార్చుకోవచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి వీటిని రద్దు చేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. 


 

click me!