చైనాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న టెస్లా...భారత్‌లో ఎంట్రీకి యాపిల్ మార్గం ఎంచుకునే అవకాశం..

By Krishna Adithya  |  First Published Aug 2, 2023, 3:40 PM IST

యాపిల్ తరహా లోనే టెస్లా సైతం భారత మార్కెట్లోకి ప్రవేశించాలని సిద్ధం అవుతోంది అయితే ఇందుకోసం ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష పద్ధతిలో ప్రవేశించాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా చైనాలో ఉన్నటువంటి కంపెనీ విడిభాగాల తయారీదారులను భారత్ లో ప్రవేశించేందుకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది.


టెస్లా చాలా కాలంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశంలో ఈ పారి పరోక్షంగా ప్రవేశం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.  ఇందుకోసం యాపిల్ మోడల్‌ను అనుసరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా టెస్లా ప్రతిపాదనలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.  టెస్లా తీసుకునే ఈ చర్య ద్వారా  చైనాకు పెద్ద దెబ్బ తగిలే చాన్స్ ఉంది. అంటే, టెస్లా  చైనీస్ కాంపోనెంట్ తయారీదారులను ఆపిల్ లాగా భారతదేశంలోకి ప్రవేశించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం తెరిచే వీలుంది. వాస్తవానికి, భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించడానికి యాపిల్ విక్రేతలకు భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. దీని ప్రయోజనం ఏమిటంటే, యాపిల్‌కు భారత్ ప్రధాన మార్కెట్‌గా మారడమే కాకుండా, కంపెనీకి భారతదేశం కూడా ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారుతోంది.

చైనాకు టెస్లా షాక్ అవుతుంది
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ తరహా మోడల్‌ను అవలంబిస్తూ టెస్లా  చైనీస్ తయారీ కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించడాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, దీని కింద ఏ ప్రత్యేక కంపెనీకి ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం లేదు. అంటే, టెస్లా ప్రత్యేక మినహాయింపు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడం లేదు అని అర్థం. అయితే టెస్లా చైనీస్ తయారీదారులు ఇండియాకు షిఫ్ట్ అవ్వాలనుకుంటే యాపిల్ లాగా వారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇలా చేయడం ద్వారా, భారతదేశంలో టెస్లా కోసం ఆపిల్ లాంటి విడిభాగాల తయారీ ఎకో సిస్టంను సృష్టించే వీలుంది. దీని కింద, బ్యాటరీ సెల్స్ మొదలైన వాటి తయారీని భారతదేశంలో ప్రోత్సహించవచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వడం లేదని కూడా నివేదికలో స్పష్టం చేసింది.

Latest Videos

ఇదిలా ఉంటే తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత టెస్లా మరోసారి భారత్‌లోకి అడుగుపెడుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీని కింద, భారత ప్రభుత్వ అధికారులు, టెస్లా సీనియర్ అధికారుల మధ్య అనేక రౌండ్ల చర్చలు కూడా జరిగాయి. అయితే పన్ను మినహాయింపుకు సంబంధించిన అంశం అలాగే ఉండిపోయింది. వాస్తవానికి, టెస్లా యజమాని ఎలోన్ మస్క్ భారతదేశంలో దిగుమతి చేసుకున్న పూర్తిగా అసెంబుల్డ్ కార్లపై 20 శాతం పన్ను రాయితీని కోరుకుంటున్నారు. అయితే దీని కోసం ఎలాంటి ప్రత్యేక తగ్గింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
 

click me!