స్టాక్ మార్కెట్లపై ‘‘ఫిచ్ ’’ ఎఫెక్ట్ : కుప్పకూలిన సూచీలు.. సెన్సెక్స్ 1000 , నిఫ్టీ 19,450 పాయింట్లు లాస్

By Siva Kodati  |  First Published Aug 2, 2023, 2:54 PM IST

అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఫిచ్ తగ్గించడంతో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 19,550 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. అన్ని సెక్టార్‌లలోనూ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.


దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ ఒడిదొడుకులకు గురవుతూ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఫిచ్ తగ్గించడంతో పాటు వచ్చే మూడేళ్లలో పెద్దన్న ఆర్ధిక వ్యవస్థ మరింతగా క్షీణిస్తుందని హింట్స్ ఇచ్చింది. ఇది ఆసియా మార్కెట్లు ముఖ్యంగా భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్‌లపై పెను ప్రభావం చూపింది. విదేశీ పెట్టుబడులు కూడా తరలిపోవడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం ఉదయం నుంచి దీశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 19,550 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది.

అన్ని సెక్టార్‌లలోనూ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీలో ఎన్టీపీసీ, హీరో మోటార్ కార్ప్, టాటా స్టీల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా షేర్లు భారీగా పతనమయ్యాయి. యూపీఎల్ , ఓఎన్జీసీ, కోల్ ఇండియా , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. 

Latest Videos

బుధవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 394.91 పాయింట్ల పతనంతో 66,064 స్థాయి వద్ద ప్రారంభమైంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 78.15 పాయింట్ల క్షీణతతో 19,655 వద్ద ప్రారంభమైంది. అయితే మారుతీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఈరోజు మంచి లాభాలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా.. ప్రముఖ రేంటిగ్ సంస్థ ఫిచ్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏ ప్లస్‌కు తగ్గించింది. 2011 తర్వాత అమెరికా క్రెడిట్ రేటింగ్ పడిపోవడం ఇదే తొలిసారి. పెరుగుతున్న అప్పుల భారం కారణంగానే క్రెడిట్ రేటింగ్ తగ్గించినట్లుగా విశ్లేషకుల అంచనా. అగ్రరాజ్యం అప్పులు జీడీపీలో 98 శాతంగా వున్నాయి. గడిచిన 20 ఏళ్ల కాలంలో చూస్తే అమెరికాలో పాలనా స్థితి మరింతగా దిగజారిందని ఫిచ్ వివరించింది. ఫిచ్ రేటింగ్‌ను ఇన్వెస్టర్లు బెంచ్ మార్క్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్ధిక వ్యవస్థ దిగజారితే అది పరోక్షంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 

click me!