
న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. తాను చేసిన ట్వీట్ తో ఒక కంపెనీ షేర్లు అమాంతం ఆకాశానికి ఎగిశాయి. అయితే ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి నుండి ప్రవేశపెట్టనుండి.
ఈ తాజా ప్రైవసీ పాలసీ తో వాట్సాప్ వినియోదారులలో గందరగోళం మొదలైంది. దీంతో వాట్సాప్ డౌన్ లోడ్లు పడిపోయి ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ సిగ్నల్ డౌన్ లోడ్లు పెరిగాయి. ఈ సమయంలో ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ ఇన్వెస్టర్ల ఆకర్షించింది.
ట్విటర్ లో ‘సిగ్నల్ వాడండి..’ అంటూ చేసిన ఎలాన్ మస్క్ ట్వీట్ సంచలనం సృష్టించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీతో ఆందోళన చెందిన వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్ యాప్ కి మారుతుండటంతో వాట్సాప్ మాతృత సంస్థ ఫేస్ బుక్‌లో కలకలం చెలరేగింది.
ఎలాన్ మస్క్ ట్వీట్ ఒక్కసారిగా ‘సిగ్నల్’ షేర్లు దూసుకుపోయేలా చేసింది. కానీ ఈ ట్వీట్ తో కొందరు పెట్టుబడిదారులు తప్పుదారి పట్టిపోయారు. సిగ్నల్ వాడండి అంటే సిగ్నల్ అడ్వాన్స్ అనే సంస్థ అని పెట్టుబడిదారులు పొరబడి ఆ సంస్థలోకి భారీగా పెట్టుబడులు చేశారు.
also read ఇండియాలోకి టెస్లా కంపెనీ.. నెక్స్ట్ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్.. కొనసాగుతున్న చర్చలు.. ...
పెట్టుబడులు భారీగా వచ్చి పడడంతో కంపెనీ షేర్ ధర ఏకంగా 6 రేట్లు పెరిగింది. ఎలాన్ మస్క్ చేసిన త్వ్వెట్ తో కేవలం 3 రోజుల వ్యవధిలో ఆ కంపెనీ షేర్ల విలువ ఏకంగా 5100 శాతం పెరిగి మార్కెట్ విలువ 390 మిలియన డాలర్లు చేరుకుంది.
అయితే ఎలాన్ మస్క్ ప్రస్తావించిన సిగ్నల్ పెట్టుబడిదారులు అనుకుంటున్న సీగ్నల్ అడ్వాన్స్ కంపెనీ కాదని అప్పటికే మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నప్పటికీ షేర్ల ధరలు మాత్రం అలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిగ్నల్ అడ్వాన్స్ సీఈఓ దీనిపై స్వయంగా స్పందించారు.
ఇవెస్టర్లు పెట్టుబడులు పెట్టే క్రమంలో అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. సిగ్నల్ అడ్వాన్స్‌కు టెస్లాతో కానీ సిగ్నల్ యాప్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదు. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ యాప్ ను సిగ్నల్ ఫౌండేషన్ తయారు చేసింది. ఈ సంస్థను మాజీ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రైన్ ఆక్టన్ 2018లో స్థాపించారు. సిగ్నల్ యాప్ లో వాట్సాప్‌కు సమానమైన అన్ని ఫీచర్స్ అందిస్తుంది కానీ గూగుల్ డిస్క్ లేదా ఐక్లౌడ్‌లో చాట్‌లు బ్యాకప్ చేయడానికి అనుమతించదు.