ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్ ఔట్.. టాప్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే ?

By asianet news teluguFirst Published Dec 14, 2022, 12:41 PM IST
Highlights

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, ఎలోన్ మస్క్  మొత్తం నికర విలువ $164 బిలియన్లు ( రూ.13.55 లక్షల కోట్లు)గా ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద $171 బిలియన్లు ( రూ.14.12 లక్షల కోట్లు). 

టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని కోల్పోయాడు. దీంతో లూయిస్ విట్టన్ బాస్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రిచ్ లిస్ట్‌లో నెం.1గా చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ అండ్ బ్లూమ్‌బెర్గ్ లిస్ట్స్ ప్రకారం, సెప్టెంబరు 2021 నుండి న్యూమెరో యునో స్థానాన్ని ఆక్రమించిన టెస్లా సి‌ఈ‌ఓ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నారు

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, ఎలోన్ మస్క్  మొత్తం నికర విలువ $164 బిలియన్లు ( రూ.13.55 లక్షల కోట్లు)గా ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద $171 బిలియన్లు ( రూ.14.12 లక్షల కోట్లు). భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్లు ( రూ.10.32 లక్షల కోట్లు)తో మూడవ స్థానంలో నిలిచారు.

ఎలోన్ మస్క్ రెండవ స్థానానికి దిగజారడం మంగళవారం టెస్లా షేర్లలో తగ్గుదల కారణంగా భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని ఈ‌వి తయారీ  సంస్థ టెస్లా షేర్లు 6.5 శాతం క్షీణించి $156.91కి పడిపోయాయి, దీని మార్కెట్ క్యాప్ $500 బిలియన్ కంటే తక్కువగా ఉంది అని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో భారీగా పెట్టుబడి పెట్టిన సంగతి మీకు తెలిసిందే. దీని కోసం అతను 44 బిలియన్ డాలర్లు చెల్లించాడు. అతని ఆధ్వర్యంలో మైక్రోబ్లాగింగ్ దిగ్గజం Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ తో సహా కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్  ఇతర దేశాల కంటే యూ‌ఎస్ లో ఎక్కువ మంది యూజర్లు కోల్పోతుందని, దీనితో పాటు 2024లో ప్రతినెల యూజర్ల సంఖ్య  50.5 మిలియన్లు పడిపోతారని, ఇది 2014 నుండి కనిష్ట స్థాయి అని ఒక నివేదిక పేర్కొంది.

"సాంకేతిక సమస్యలు, ద్వేషపూరిత లేదా ఇతర అసహ్యకరమైన కంటెంట్‌ల కారణంగా యూజర్లు విసుగు చెంది వచ్చే ఏడాది  ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను వదిలివేయడం ప్రారంభిస్తారు" అని ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్‌లో  అనలిస్ట్ జాస్మిన్ ఎన్‌బర్గ్ అన్నారు.

click me!