ఆనంద్ మహీంద్రాకి ట్విట్టర్ యూజర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న.. నెటిజన్లు హృదయాలను గెలుచుకున్న రిట్వీట్..

Published : Dec 14, 2022, 11:38 AM IST
ఆనంద్ మహీంద్రాకి ట్విట్టర్ యూజర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న.. నెటిజన్లు హృదయాలను గెలుచుకున్న రిట్వీట్..

సారాంశం

ట్విట్టర్ యూజర్  అడిగిన ప్రశ్నకు  మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో నెలరోజుల తరువాత ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విక్రాంత్ సింగ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ప్రశ్న అడిగాడు,  

దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా భారతదేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు హోదాపై ఎప్పుడూ ఆశ పడలేదు. దేశం కోసం తన వంతు కృషి చేస్తాడు ఇంకా సోషల్ మీడియా ద్వారా సూపర్ యాక్టివ్‌గా ఉండటంలో పాపులర్.

బిజినెస్ కాకుండా అతను ప్రపంచం తెలుసుకోవలసిన స్ఫూర్తిదాయకమైన ఇంకా సక్సెస్ స్టోరీస్ ట్విట్టర్ ద్వారా  షేర్ చేస్తుంటాడు. ఇదొక్కటే కాదు, సోషల్ మీడియా యూజర్లు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుంటాడు.

కొద్దిరోజుల క్రితం ఒక యూజర్ అతన్ని భారతీయ సంపన్నుల లిస్ట్ లో నంబర్ 1 ర్యాంక్ ఎప్పుడు అవుతారని అడగగా  ఆనంద్  మహీంద్రా ఆసక్తికర రిట్వీట్  నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నది. 

ట్విట్టర్ యూజర్  అడిగిన ప్రశ్నకు  మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో నెలరోజుల తరువాత ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విక్రాంత్ సింగ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ప్రశ్న అడిగాడు,

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కి ఇప్పటివరకు 13K పైగా లైక్‌లు,  రీట్వీట్‌లు వచ్చాయి.

ఫోర్బ్స్ ఇండియా 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల లిస్ట్ కూడా విడుదల చేసింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, ఆనంద్ మహీంద్రా ర్యాంక్ నంబర్ 91. అతని నికర విలువ $2.1 బిలియన్.  

ఐకానిక్ ఆనంద్ మహీంద్రా చేసిన రిట్వీట్ కి పలువురు నెటిజన్లు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. 

దీనికి ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. నిజం ఏంటంటే నేను భారత్‌లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు అని అన్నారు.  

మరో వైపు రాబోయే సంవత్సరాల్లో (2024-2026) మహీంద్రా ఐదు కొత్త ఎలక్ట్రిక్ SUVలను భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లలో విడుదల చేయాలని చూస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!