
టెలికాం విభాగం ఇటీవల జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా జనవరి 15 నుండి ల్యాండ్‌లైన్ నుంచి కాల్స్ చేసే ముందు '0' నంబర్ డయల్ చేయడం అవసరమని టెలికాం ఆపరేటర్లు కస్టమర్లను కోరాయి.
"15 జనవరి 21 నుండి అమలులోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ఆదేశం ప్రకారం, మీరు ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌కు ముందు 0 నొక్కడం తప్పనిసరి" అని ఎయిర్‌టెల్ ఫిక్సెడ్ లైన్ వినియోగదారులకు తెలిపింది.
రిలయన్స్ జియో కూడా ఫిక్సెడ్ లైన్ వినియోగదారులకు ఏదైనా మొబైల్ నంబర్‌ను డయల్ చేసేటప్పుడు వారు 0 నోక్కెల చూసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తూ మెసేజులు పంపించింది.
also read తొలిసారి 10 బిలియన్ డాలర్లకు హెచ్‌సీఎల్ ఆదాయం.. వచ్చే 6 నెలల్లో 20 వేల నియమకాలు.. ...
"జనవరి 15 నుండి డయలింగ్ ప్యాటర్న్ మార్పు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ నుండి వచ్చిన ఆదేశానికి అనుగుణంగా ఉంటుంది" అని జియో మెసేజులో తెలిపింది.
జనవరి 15 నుండి ల్యాండ్‌లైన్ నుండి మొబైల్ ఫోన్‌కు కాల్స్ చేయడానికి కాలర్లు నంబర్ ముందు '0' డయల్ చేయాల్సి ఉంటుందని టెలికాం విభాగం (డిఓటి) గత నవంబర్‌లో తెలిపింది.
డయలింగ్ ప్యాటర్న్ మార్పు చర్య భవిష్యత్ ఉపయోగం కోసం తగిన వనరులను ఖాళీ చేస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా దాదాపు 2,539 మిలియన్ నంబరింగ్ సిరీస్‌లు ఉత్పత్తి అవుతాయని భావిస్తున్నారు.
ఫిక్స్‌డ్-టు ఫిక్స్‌డ్, మొబైల్-టు-ఫిక్స్‌డ్, మొబైల్-టు-మొబైల్ కాల్‌ల కోసం డయలింగ్ ప్యాటర్న్ కు సంబంధించి ఎటువంటి మార్పు ఉండదు.
దీని సంబంధించి బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్ను సంప్రదించినప్పుడు వినియోగదారుల అవగాహనకు అవసరమైన సమాచార మార్పిడి ప్రారంభించము" అని పూర్వర్ తెలిపారు.