ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏపీ కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దేశంలోకి 1,66,294 కోట్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. ఇందులో జనవరి-మార్చి మధ్య 76,361 కోట్లు రాగా, ఏప్రిల్-జూన్ మధ్య 89,933 కోట్లు వచ్చాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ కంటే ఏపీ చాలా వెనుకబడి ఉంది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఏపీ కంటే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) వచ్చాయి. ఈ 6 నెలల్లో తెలంగాణకు 8,655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు 744 కోట్లు మాత్రమే వచ్చినట్లు డిపిఐఐటి (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) వెల్లడించింది.
2023 మొదటి ఆరు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో వచ్చిన ఎఫ్‌డిఐలు: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏపీ కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దేశంలోకి 1,66,294 కోట్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. ఇందులో జనవరి-మార్చి మధ్య 76,361 కోట్లు రాగా, ఏప్రిల్-జూన్ మధ్య 89,933 కోట్లు వచ్చాయి.
కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ ప్రకారం ఈ ఆరు నెలల్లో తెలంగాణకు 8,655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు 744 కోట్లు మాత్రమే అందాయని తెలిపింది. కామర్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం ఏపీకి తొలి మూడు నెలల్లో 297 కోట్లు రాగా, తర్వాతి మూడు నెలల్లో 447 కోట్లు వచ్చాయి. తెలంగాణకు తొలి మూడు నెలల్లో 1,826 కోట్లు రాగా, ఆ తర్వాత మూడు నెలల్లో 6,829 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల పెట్టుబడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది.
ఎఫ్‌డీఐ ర్యాంకింగ్స్‌పై చంద్రబాబు ట్వీట్: ఎఫ్‌డీఐలో ఏపీ ర్యాంకు దిగజారడం దురదృష్టకరం: చంద్రబాబు
ఈ త్రైమాసికంలో మహారాష్ట్ర రూ.36,634 కోట్లు, ఢిల్లీ రూ.15,358 కోట్లు, కర్ణాటక రూ.12,046 కోట్లు, తెలంగాణ రూ.6,829 కోట్లు, గుజరాత్ రూ.5,993 కోట్లు, తమిళనాడు రూ.5,181 కోట్లు, హర్యానా రూ.4,056 కోట్లు వచ్చాయి. ఇందులో గుజరాత్ కంటే తెలంగాణ ఒక మెట్టు పైన ఉంది. 2023 మొదటి ఆరు నెలల్లో, తెలంగాణ 6వ స్థానంలో ఉండగా, 2023 మొదటి ఆరు నెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది.
మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 16 రాష్ట్రాలకు 100 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో మొదటి 7 రాష్ట్రాలలో మొత్తం 1,58,289 కోట్లు పెట్టుబడి అందుకోగా, మిగిలిన 9 రాష్ట్రాలకి మొత్తం 7,746 కోట్లు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆంధ్రప్రదేశ్‌కు 6,495 కోట్ల ఎఫ్‌డిఐలు రాగా, తెలంగాణకు 42,595 కోట్లు వచ్చాయి.