స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా..అయితే ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్ వేయండి..?

By Krishna Adithya  |  First Published Aug 31, 2023, 5:49 PM IST

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. అంతేకాదు స్టాక్స్ మార్కెట్స్ లో పెట్టుబడి పెడితే మునిగిపోతామని నష్టపోతామని దివాలా తీస్తామని కూడా చాలామంది సలహా ఇస్తూ ఉంటారు.  కానీ నిజానికి  అన్ని రకాల పెట్టుబడులకన్నా కూడా స్టాక్ మార్కెట్లలో చాలా త్వరగా డబ్బు సంపాదించవచ్చు.


భారత స్టాక్ మార్కెట్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్టాక్ మార్కెట్ లుగా పేరుగాంచాయి.  ఈక్విటీ మార్కెట్స్ ప్రతి దశాబ్దం డేటా  గమనించినట్లయితే,  పెరగటమే తప్ప తగ్గడం అన్నది కనిపించడం లేదు. 2010  సంవత్సరంలో సుమారు 20 వేల పాయింట్లు వద్ద ఉన్న సెన్సెక్స్ 2020 నాటికి  47 వేల పాయింట్లకు చేరింది.  ప్రస్తుతం సెన్సెక్స్ 65 వేల పాయింట్లు దాటింది.  ఈ లెక్కన గడచిన 13 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే సెన్సెక్స్ మూడు రెట్లు పెరిగింది.  దీనిబట్టి ఇన్వెస్టర్ల సంపద ఎన్ని రెట్లు పెరిగిందో మీరు ఊహించుకోవచ్చు.  ఈ రేంజ్ లో బంగారము రియల్ ఎస్టేట్ కూడా పెరగలేదు అంటే మీరు నమ్మక లేకపోవచ్చు.  రియల్ ఎస్టేట్లో కొన్ని నగరాలు అందులోనూ కమర్షియల్ సెగ్మెంట్స్ తప్ప ఈ రేంజ్ లో పెరిగిన రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉండవు. 

ఇక బంగారం విషయానికొస్తే బంగారం కూడా భారీగానే పెరిగినప్పటికీ స్టాక్ మార్కెట్ రేంజ్ లో పెరగలేకపోయింది.  అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే.ఎలా అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు  కానీ స్టాక్ మార్కెట్లో కొన్ని క్వాలిటీ స్టాక్స్ మీద మీరు ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు.  ముఖ్యంగా లార్జ్ క్యాప్ కంపెనీలు కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటాయి.  పూర్తిగా రిస్క్ లేదని చెప్పలేము.  కానీ   ఫండమెంటల్స్ బలంగా ఉన్న  స్టాక్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంది అలాంటి దిగ్గజ కంపెనీల లార్జ్ కాప్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

Latest Videos

2023లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ స్టాక్‌లు ప్రస్తుతం పెట్టుబడి పెట్టడానికి ఐదు ఉత్తమ స్టాక్‌ల లిస్టు ఇక్కడ ఉంది.. వాటి ఆధారంగా మీరు స్టాక్‌లను కొనుగోలు చేయవచ్చు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనేది ఆయిల్ టు కెమికల్స్ (02C), ఆయిల్ & గ్యాస్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్లలో పనిచేస్తున్న భారతదేశ-ఆధారిత కంపెనీ. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) అనేది సమాచార సాంకేతిక (IT) సేవలు మరియు డిజిటల్, వ్యాపార పరిష్కారాలను అందించడంలో నిమగ్నమై ఉన్న భారతదేశానికి చెందిన సంస్థ. కంపెనీ విభాగాలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్, తయారీ, రిటైల్ , వినియోగదారుల వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, మీడియా మరియు టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ , హెల్త్‌కేర్ మరియు ఇతరాలు ఉన్నాయి.

HDFC బ్యాంక్:  HDFC బ్యాంక్ లిమిటెడ్ భారతదేశంలోని ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ మరియు భారతదేశంలో ఈరోజు కొనుగోలు చేయడానికి ఉత్తమమైన స్టాక్‌లలో ఒకటి. బ్యాంక్ హోల్‌సేల్ వైపు వాణిజ్య మరియు పెట్టుబడి బ్యాంకింగ్ మరియు రిటైల్ వైపు లావాదేవీ/బ్రాంచ్ బ్యాంకింగ్ వంటి అనేక రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.

ఇన్ఫోసిస్ : ఇన్ఫోసిస్ లిమిటెడ్ కన్సల్టింగ్, టెక్నాలజీ, ఔట్‌సోర్సింగ్ మరియు తదుపరి తరం డిజిటల్ సేవలలో పాల్గొంటుంది మరియు ఇది ఉత్తమ దీర్ఘకాలిక పెన్నీ స్టాక్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

హిందుస్తాన్ యూనిలీవర్ : హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఒక భారతీయ వినియోగ వస్తువుల సంస్థ. అందం, వ్యక్తిగత సంరక్షణ, ఆహారం, రిఫ్రెష్‌మెంట్ ఎగుమతులు, శిశువు సంరక్షణ ఉత్పత్తులను కలిగి ఉంటుంది.

గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు  లాభనష్టాలకు లోబడి ఉంటాయి.  ఏషియ నెట్ న్యూస్ తెలుగు  మీకు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వదు.  పైన పేర్కొన్నటువంటి స్టాక్ రికమండేషన్ కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.  మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు.   మీరు పెట్టుబడి పెట్టేముందు నిపుణులైన ఫైనాన్షియల్ అడ్వైజర్ లను సంప్రదిస్తే మంచిది.

click me!