‘టాటా’ల చేతికే ఎయిర్ ఇండియా..! స్థాపించిన సంస్థ గూటికే ఎయిర్‌లైన్స్

By telugu teamFirst Published Oct 1, 2021, 12:38 PM IST
Highlights

ఎయిర్ ఇండియా విమాన సంస్థ డిజిన్వెస్ట్‌మెంట్ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆ సంస్థ కొనుగోలు కోసం వేసిన బిడ్లపై ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బిడ్‌ను అత్యధికంగా పలికి టాటా సన్స్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్నట్టు తెలిసింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థను స్థాపించిన టాటాల చెంతకే ఇది చేరినట్టయింది.
 

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) డిజిన్వెస్ట్‌మెంట్‌‌(Disinvestment)లో ఎట్టకేలకు కీలక మలుపు వచ్చింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు వేసిన బిడ్‌(Bid)ను టాటా సన్స్(Tata Sons) సంస్థ గెలుచుకుంది. ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయాలన్న టాటా సన్స్ ప్రతిపాదనను కేంద్ర మంత్రుల ప్యానెల్ అంగీకరించినట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఎయిర్ ఇండియా హ్యాండోవర్ ప్రక్రియనంతా పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం(Union Government) కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, అవి విఫలమవుతూనే వచ్చాయి. తాజాగా ఎయిర్‌లైన్ మినిమమ్ రిజర్వ్ ప్రైస్‌ను కేంద్రం ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ రిపోర్టులు రాగానే జాతీయ విమానయాన సంస్థపై పారిశ్రామికవర్గాల ఆసక్తి పెరిగింది. టాటా సన్స్ ఈ నెల 15న బిడ్ వేసినట్టు తెలిసింది. మిగతా సంస్థల కంటే అధికంగా బిడ్ టాటా సన్స్ వేశారని, సుమారు రూ. 3000 కోట్ల బిడ్ వేసినట్టు సమాచారం. అందుకే ఎయిర్ ఇండియాను టాటాలే చేజిక్కించుకున్నట్టు సమాచారం అందింది.

ఎయిర్ ఇండియా కొనుగోలుపై టాటాలకు అమితాసక్తి ఉన్నది. ఈ జాతీయ విమానయాన సంస్థతో టాటాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. ఈ సంస్థను వ్యవస్థాపించినదే టాటాలే. ఆర్జేడీ టాటా(RJD Tata)నే ఈ సంస్థను స్థాపించారు. 1932లో విమానాన్ని నడిపి భారత వైమానికరంగానికి తెరదీశారు. అయితే, స్వాతంత్ర్యానంతర పరిస్థితుల తర్వాత ఈ సంస్థ పెను మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1953లో నేషనలైజేషన్ ప్రక్రియతో ఈ ప్రైవేటు సంస్థ జాతీయపరం కావాల్సి వచ్చింది. తాజాగా, మళ్లీ అదే సంస్థ గూటికి ఎయిర్‌ ఇండియా చేరుతుండటం విశేషం.

click me!