స్టాక్ మార్కెట్ టుడే : 2వ రోజు కూడా నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

By asianet news teluguFirst Published Sep 29, 2021, 5:05 PM IST
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు వరుసగా రెండవ రోజు కూడా నష్టాలతో ముగిశాయి. ఉదయం కూడా నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు  షేర్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. 

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రెండోరోజు అంటే బుధవారం రోజంతా హెచ్చు తగ్గులు తర్వాత నష్టాలలో  ముగిసింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు దేశీయంగా ముడి చమురు ధరలు, వస్తువుల ధరల పెరగడంతో పాటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 254.33 పాయింట్లు (0.43 శాతం) తగ్గి 59,413.27 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 37.30 పాయింట్లు (0.21 శాతం) తగ్గి 17,711.30 వద్ద ముగిసింది. ప్రారంభ ట్రేడ్‌ని పరిశీలిస్తే సెన్సెక్స్ 200 పాయింట్లు మెరుగుపడింది.  సుమారు 1830 షేర్లు అడ్వాన్స్ అయితే, 1371 షేర్లు క్షీణించాయి, 151 షేర్లు మారలేదు.

ఈరోజు దేశీయ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఆధిపత్యం చెలాయించింది.  స్టాక్ మార్కెట్లో ముడి చమురు తీవ్రంగా ప్రభావితమైంది. గత మూడు సంవత్సరాలలో మొదటిసారిగా ముడి చమురు 80 డాలర్లు దాటింది, ఈ కారణంగా దేశీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపింది. చైనాలో విద్యుత్తు కోతల నేపథ్యంలో ఆసియా సూచీలు మిశ్రమంగా ముగిశాయి. 

also read డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి..ఎలా పొందాలి..? దీని ప్రయోజనాలను ఎంటో తెలుసుకోండి..

  కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, టైటన్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌ గ్రీన్ షేర్లు లాభాలలో ముగిశాయి. మరోవైపు, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్ రెడ్ మార్క్‌తో ముగిశాయి . 

 ఇండెక్స్ చూస్తే నేడు ఐటి, మీడియా, రియాల్టీ, ఫార్మా, మెటల్, పిఎస్‌యూ బ్యాంకులు ఆకుపచ్చ గుర్తుపై ముగిసింది. అయితే ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటోమొబైల్ రెడ్ మార్క్‌లో ముగిసాయి. 

స్టాక్ మార్కెట్ నేడు ప్రారంభ ట్రేడ్‌లో నష్టాలతో ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 449.72 పాయింట్లు (0.75 శాతం) తగ్గి 59,217.88 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నిఫ్టీ 121.80 పాయింట్ల (0.69 శాతం) క్షీణతతో 17,626.80 వద్ద ప్రారంభమైంది. 

click me!