టాటా సరి కొత్త పంథా.. త్వరలోనే మార్కెట్‌లోకి...

By Rekulapally SaichandFirst Published Dec 3, 2019, 12:39 PM IST
Highlights

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వడివడిగా విద్యుత్ వాహనాల రంగంలోకి అడుగిడేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన సరికొత్త విద్యుత్ వినియోగ కారు ‘టాటా నెక్సన్’ ను సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. 

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వడివడిగా విద్యుత్ వాహనాల రంగంలోకి అడుగిడేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన సరికొత్త విద్యుత్ వినియోగ కారు ‘టాటా నెక్సన్’ ను సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. 

ఈ నెలలో ఆవిష్కరిస్తున్నా వచ్చే ఏడాదిలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది టాటా మోటార్స్. సంస్థ నుంచి వస్తున్న తొలి విద్యుత్ కారు ఇది కాకున్నా.. టాటాకు మాత్రమే ప్రత్యేకించిన తాజా ‘జిప్ట్రాన్ ఎలక్ట్రానిక్ పవర్ ట్రైన్ టెక్నాలజీ’తో వస్తున్న తొలి విద్యుత్ ఎస్ యూవీ కారు నెక్సన్ ని తెలిపింది.

Read also: డీజిల్ వాహనాల నిషేధం? ఆ కార్లపైనే కస్టమర్ల మోజు

లిక్విడ్ కూల్డ్ ఐపీ 67 సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని దీనిలో వినియోగించారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ అయిన ఈ బ్యాటరీకి ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది టాటా మోటార్స్స్. 

ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలో మీటర్ల వరకు ఈ కారు ప్రయాణిస్తుంది. దీనిలో పర్మినెట్ మాగ్నెట్ ఏసీ మోటారు వాడారు. రీ జనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థతో వస్తున్న ఈ మోటారు డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాటరీని రీచార్జి చేస్తుంది.

ఇప్పటికే పలుసార్లు భారతీయ రోడ్లపై టాటా నెక్సన్ విద్యుత్ కారును పరీక్షించినా కొత్త డిజైన్ బయటకు రాకుండా టాటా మోటార్స్ జాగ్రత్త పడింది. పాత నెక్సన్ డిజైన్ లో ఉన్న ఎలక్ట్రిక్ కారునే పరీక్షించారు. కారు ముందు భాగం కూడా సరికొత్తగా ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇక దీని ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో మార్కెట్లో విడుదల చేసేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్నది. 

Read also: 

click me!