మేడం.. వుయ్ ఆర్ నాట్ యాంటీ నేషనల్స్.. బట్ వాంట్ ప్రోగ్రెస్

By Rekulapally SaichandFirst Published Dec 3, 2019, 11:57 AM IST
Highlights

శనివారం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరికి పాకించడం జాతి ప్రయోజనాలను దెబ్బ తీసినట్లే’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ కంపెనీలు జాతికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోవని బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించేందుకు కార్పొరేట్ ప్రపంచం భయపడుతున్నదన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్‌కు ఆమె మద్దతును కొనసాగించారు.

శనివారం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరికి పాకించడం జాతి ప్రయోజనాలను దెబ్బ తీసినట్లే’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. బజాజ్ వ్యాఖ్యల వీడియోనూ ఆమె షేర్ చేశారు.

 Also Read:  వేటుపై పోరుకు చందాకొచ్చర్.. బాంబే హైకోర్టులో పిటిషన్

‘రాహుల్ బజాజ్ లేవనెత్తిన అంశాలపై హోంమంత్రి అమిత్ షా జవాబిచ్చారు. ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. మోదీని మీడియా విమర్శిస్తూనే ఉంది. ఒకవేళ మీరు అన్నట్లు ఆ వాతావరణమే ఉంటే దానిని మెరుగుపరిచేందుకు మనమంతా క్రుషి చేయాలని రాహుల్ బజాజ్ ను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. అయినా సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను దెబ్బ తీయడం తగదని ఆమె పేర్కొన్నారు.

దీనిపై కిరణ్ మజుందార్ ప్రతిస్పందిస్తూ ‘మేడం మేం జాతి వ్యతిరేకులం కాదు. ప్రభుత్వ వ్యతిరేకులం కాదు. వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ విజయం సాధించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం మెరుగుగైన విధానాన్ని ప్రోత్సహించాలని రాజకీయాలతో సంబంధం లేదని నేను కోరుకుంటున్నాను’ అని నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి కిరణ్ మజుందార్ ట్వీట్ చేశారు. 

Also Read: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్

కానీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రపంచం నుంచి విమర్శలు స్వీకరించేందుకు సుముఖంగా లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ వైఫల్యాలను బహిరంగంగా ఖండించానని గుర్తు చేశారు. ఇంతకుముందు కిరణ్ మజుందార్ స్పందిస్తూ.. ప్రజల్లో డిమాండ్ పెంపొందించేందుకు, వ్రుద్ధిరేటు పురోగతి కోసం పారిశ్రామికవేత్తల సలహాలు తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. 

click me!