
Tamilnad Mercantile Bank Shares Listing: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO ఇన్వెస్టర్లకు నిరాశ మిగిల్చింది. ఈ చారిత్రక బ్యాంకు షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే లిస్టింగ్ లాభాలను ఆశించిన పెట్టుబడిదారులను నిరాశపరిచింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ షేర్లు BSEలో రూ. 510 వద్ద లిస్ట్ అయ్యింది. అయితే ఇష్యూ ధర కూడా రూ. 510 కావడం గమనార్హం, అంటే ఇది ఫ్లాట్ లిస్టింగ్ గా చెప్పవచ్చు. అదే సమయంలో, 3 శాతం నష్టంతో NSEలో లిస్ట్ అయ్యాయి. ఒక్కో షేరుకు రూ. 495 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లో లిస్ట్ అయ్యాయి. ఈ కోణంలో, పెట్టుబడిదారులు ఎటువంటి లిస్టింగ్ లాభాలను పొందలేదు .
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO 5 సెప్టెంబర్ 2022 నుండి 7 సెప్టెంబర్ 2022 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. ఈ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.510గా నిర్ణయించారు. ఈ ఐపీఓ విలువ రూ.832 కోట్లు. బ్యాంక్ ఇచ్చిన పత్రాల ప్రకారం, ఐపిఓలో 1.58 కోట్ల కొత్త షేర్లను జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఉదయం 10:15 గంటలకు బిఎస్‌ఇలో రూ. 509.90 వద్ద ట్రేడవుతోంది, ఇష్యూ ధర కంటే 0.02 శాతం తగ్గి ఎన్‌ఎస్‌ఇలో రూ. 509.00 వద్ద 0.20 శాతం తగ్గింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,074.34 కోట్లుగా ఉందని బిఎస్‌ఇ డేటా వెల్లడించింది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO కేవలం 2.86 రెట్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. వీరి కోసం రిజర్వు చేసిన కోటా కింద 1.62 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 2.94 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 6.48 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. IPOలో, రిటైల్ పెట్టుబడిదారుల కోసం 10 శాతం కోటాను ఉంచారు.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ గురించి..
100 సంవత్సరాల చరిత్ర ఉన్న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ దేశంలోని పురాతన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు ముఖ్యంగా MSME, వ్యవసాయం , రిటైల్ రంగాలకు రుణాలను అందిస్తుంది. మార్చి 2022 నాటికి, బ్యాంకు రూ. 44,930 కోట్లను డిపాజిట్లుగా స్వీకరించింది , రూ. 33,490 కోట్లను రుణాలుగా పంపిణీ చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లాభం రూ.820 కోట్లు. బ్యాంకుకు 509 శాఖలు ఉన్నాయి, వీటిలో 106 గ్రామీణ ప్రాంతాల్లో, 247 సెమీ అర్బన్ ప్రాంతాల్లో, 80 పట్టణాల్లో , 76 మెట్రో నగరాల్లో ఉన్నాయి. తమిళనాడులో మాత్రమే బ్యాంకుకు 369 శాఖలు ఉన్నాయి.