క్రూడాయిల్ ధర పెంపు.. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకి రూ. 84కే, డీజిల్ ధర తెలుసుకోండి

By asianet news teluguFirst Published Sep 15, 2022, 9:09 AM IST
Highlights

 చమురు కంపెనీల నష్టాన్ని భర్తీ చేయడానికి 20,000 కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో రానున్న కాలంలో ఎల్‌పీజీ సిలిండర్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొంతకాలంగా క్రూడాయిల్ ధర తగ్గుతూ వస్తోంది. అయితే బుధవారం సాయంత్రం ముగిసిన మార్కెట్‌లో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ క్రూడాయిల్ ధర 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. క్రూడాయిల్ ధరల పతనం దేశీయ మార్కెట్‌లో చమురు ధరపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో పెట్రోల్‌-డీజిల్‌ ధరలు  స్థిరంగా ఉన్నాయి.

20,000 కోట్ల ప్యాకేజీ
 చమురు కంపెనీల నష్టాన్ని భర్తీ చేయడానికి 20,000 కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో రానున్న కాలంలో ఎల్‌పీజీ సిలిండర్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1న చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి.  

గత నెల మే 22న ప్రభుత్వం పెట్రోల్ - డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత ధరలో మార్పు వచ్చింది. దీని తరువాత మహారాష్ట్ర, మేఘాలయలో చమురు ధర కూడా మారిపోయింది. గురువారం ఉదయం WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 88.99 డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 94.53 వద్ద ఉంది.

మెట్రో నగరాల్లో నేడు పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ లీటరుకు రూ. 89.62
 - ముంబైలో పెట్రోల్ రూ. 106.31, డీజిల్ రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ రూ. 102.63, డీజిల్ రూ . 94.24
- కోల్‌కతాలో రూ. 94.24. - రూ.3, 10 డీజిల్ లీటరుకు రూ. 92.76
- నోయిడాలో పెట్రోల్ రూ. 96.65, డీజిల్ లీటరుకు రూ. 89.82 
– ఘజియాబాద్‌లో రూ.96.26, డీజిల్ లీటరుకు రూ.89.45కి చేరింది.
-లక్నోలో లీటరు పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76గా ఉంది.
- పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04గా ఉంది.
–పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ఈ విధంగా పెట్రోల్ -డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు
ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP ఇంకా వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్‌లు HPPrice సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

click me!