విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్.. రివ్యూ పిటిషన్‌ పై ఏమన్నాదంటే..

By Sandra Ashok KumarFirst Published Aug 27, 2020, 2:18 PM IST
Highlights

విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేసినందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరింది. న్యాయమూర్తులు యు.యు.లలిత్, అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులను రిజర్వు చేసుకుంది. 

న్యూ ఢీల్లీ: వ్యాపారవేత్త, ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వు చేసింది. విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేసినందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరింది.

న్యాయమూర్తులు యు.యు.లలిత్, అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులను రిజర్వు చేసుకుంది. అంతేకాదు  విజయ్ మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది.

గత మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను కోర్టు ముందు ఎందుకు లిస్ట్ చేయలేదో వివరించాలని, గడిచిన మూడేళ్లలో రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌తో వ్యవహరించిన అధికారుల పేర్లతో సహా అన్ని వివరాలను అందించాలని సుప్రీం కోర్టు జూన్ నెలలో రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

also read 

విజయ్ మాల్యా మే 9, 2017లో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రివ్యూ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదిలీ చేసినందుకు, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి రూ.9వేల కోట్లకు పైగా బ్యాంకు లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడైన మాల్యా ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు 2017లో ఉత్తర్వు వచ్చింది, బ్రిటీష్ సంస్థ డియాజియో నుండి అందుకున్న 40 మిలియన్ డాలర్లను మాల్యా తన పిల్లలకు బదిలీ చేసినట్లు పేర్కొంది.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి మాల్యా వాస్తవాలను దాచిపెట్టి, తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్య మాల్యాకు మళ్లించారని బ్యాంకులు ఆరోపించాయి.
 

click me!