'నేను అప్పుడే హెచ్చ‌రించినా కాని ప‌ట్టించుకోలేదు': రాహుల్ గాంధీ

By Sandra Ashok KumarFirst Published Aug 26, 2020, 4:23 PM IST
Highlights

 నేను నెలల తరబడి దేశ ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతున్నా విషయాన్ని ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది. పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గింపు కాదు పేదలకు డబ్బు పంచండి, వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించండి. 
 
కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక మంద‌గ‌మ‌నంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌నే ఆర్‌బీఐ ధృవీకరించిందంటూ  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా  ట్వీట్ చేశారు.  

నేను నెలల తరబడి దేశ ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతున్నా విషయాన్ని ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది. పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గింపు కాదు పేదలకు డబ్బు పంచండి, వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించండి. 

 ప్రచారాల‌కు కోసం మీడియాను ఉపయోగించుకున్న భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉంద‌న్న విష‌యం  క‌నిపించ‌క‌మానదు' అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తూ  ట్వీట్ చేశారు.

also read టిఇ ఉమెన్ రీజినల్ ఫైనల్స్‌ విజేతలను ప్రకటించిన సాపియన్ బయోసైన్సెస్ ...

పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది. ప్ర‌స్తుతం దేశ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని, ఇప్ప‌ట్లో ఇండియాలో కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ఆర్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డించింది.

అయితే ఈ ప‌రిస్థితుల‌పై తాను ఎప్పుడో మాట్లాడిన మోదీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని రాహుల్ ఆరోపించారు. లోక్‌సభలో కేరళ వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ కరోనా వైరస్ మహమ్మారి, చైనాతో సరిహద్దు వివాదంతో సహా పలు సమస్యలపై కేంద్రంపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

click me!