కరోనాపై పోరు.. రూ.25 కోట్ల మెడిసిన్స్ సరఫరాకు సన్ ఫార్మా రెడీ

By narsimha lodeFirst Published Mar 29, 2020, 12:10 PM IST
Highlights

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒక్కటైన సన్ ఫార్మా ముందుకు వచ్చింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒక్కటైన సన్ ఫార్మా ముందుకు వచ్చింది. రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్సీక్యూఎస్), అజిథ్రోమైసిన్ తదితర సంబంధ ఔషధాలను, హ్యాండ్ శానిటైజర్లను పంపిణీ చేసేందుకు సిద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 (కరోనా వైరస్) రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాలను వాడాలని ఈ విషయమై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే సిఫారసు చేసింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్సీక్యూఎస్)ను పూర్తిగా అధ్యయనం చేసింది. కొవిడ్-19 రోగులకు అజిథ్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడకంపై స్టడీ చేసినట్లు పేర్కొంది. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వాటాదారులతో కలిసి పని చేస్తామని సన్ ఫార్మా తెలిపింది. అత్యవసర సమయంలో నిరంతరాయంగా ఔషధాల సరఫరా చేయడానికి చర్చలు తీసుకుంటామని వివరించింది. 

పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఈ ఉత్పత్తులను పంపిణీ చేసే సమయంలో పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూత నివ్వడం మెడికల్, దాని అనుబంధ రంగాల బాధ్యత అని పేర్కొంది. 

తమ సంస్థ వినియోగదారులకు అత్యున్నత నాణ్యతతో కూడిన హ్యాండ్ శానిటైజర్లను ఉత్పత్తి చేస్తుందని సన్ ఫార్మా వెల్లడించింది. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌తోపాటు దేశానికి సేవలందిస్తున్న రంగాలకు ప్రత్యేకించి వైద్యుల కోసం నాణ్యత కూడన శానిటైజర్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

also read:మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

ఈ శానిటైజర్లను తయారు చేయడం కోసమే భారతదేశంలోని ఓ యూనిట్‌ను కేటాయించామని సన్ ఫార్మా వెల్లడించింది. అలాగే సంస్థకు చెందిన కొంత మంది ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించినట్లు సన్ ఫార్మా వెల్లడించింది. 

మరోవైపు సన్ ఫార్మా అనుబంధంగా ఉన్న అమెరికా సంస్థ ఇంక్ యూఎస్ఏ ఇప్పటికే అమెరికాలో 25 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సల్ఫేట్ టాబ్లెట్లను విరాళంగా అందజేసింది. సన్ ఫార్మా నార్త్ అమెరికా సీఈఓ అభయ్ గాంధీ మాట్లాడుతూ క్లినికల్ టెస్టుల ద్వారా కొవిడ్-19 వైరస్ నివారణ మందును నిర్ధారించాలని సూచించారు. కొవిడ్-19పై పోరాటంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అందరితో కలిసి పని చేస్తామని హామీనిచ్చారు. 

click me!