Sugar Price: నాలుగేండ్ల క‌నిష్టానికి ప‌డిపోయిన ఉత్ప‌త్తి.. భారీగా పెర‌గ‌నున్న చ‌క్కెర ధ‌ర‌లు

By Mahesh Rajamoni  |  First Published Sep 13, 2023, 4:25 PM IST

New Delhi: దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు భారీగా పెర‌గున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడు వారాల్లో ధరలు రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. గత మూడేళ్లుగా ప్రపంచంలోని అగ్రగామి ఎగుమతిదారుల్లో భారత్‌ ఒకటి. అయితే, ప్ర‌స్తుతం మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి ఆగస్టు తర్వాత 4 సంవత్సరాలలో కనిష్టానికి పడిపోనుందనీ, ఇది తగ్గిన ఉత్పత్తి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 


Sugar Price Hike in India: దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు భారీగా పెర‌గున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడు వారాల్లో ధరలు రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. గత మూడేళ్లుగా ప్రపంచంలోని అగ్రగామి ఎగుమతిదారుల్లో భారత్‌ ఒకటి. అయితే, ప్ర‌స్తుతం మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి ఆగస్టు తర్వాత 4 సంవత్సరాలలో కనిష్టానికి పడిపోనుందనీ, ఇది తగ్గిన ఉత్పత్తి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. భారత్ లో చక్కెర ధరలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. చక్కెర ఉత్పత్తి తగ్గడంతో దేశంలో చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. చక్కెర ధరలు పక్షం రోజుల్లో 3 శాతానికి పైగా పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయ‌ని మార్కెట్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే సమయంలో రానున్న నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి ప్రాంతమైన మ‌హారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటం రాబోయే సీజన్లో చెరకు ఉత్పత్తిపై ఆందోళనలను పెంచిందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా మార్కెట్లో చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Latest Videos

undefined

చ‌క్కెర ధ‌ర‌లు పెరుగుతున్న ఆహార ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా ఉంది. భారతదేశ చక్కెర ఉత్పత్తి అంచనాలు, ఎగుమ‌తి ఆంక్ష‌లు ఆందోళనలు రేకెత్తించ‌డంతో ప్రపంచ చక్కెర ధరలను 12 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, ఎగుమతులు లేకపోవడం వల్ల స్థానిక ఉత్పత్తిదారులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. అదే సమయంలో, దిగుమతి లేనందున, స్థానిక ధరలకు ప్రపంచ ధరలతో ప్రత్యక్ష / పరోక్ష సంబంధం లేకుండా ఉంది.

భారత్ లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం

ఈ నెల ప్రారంభంలో, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఎ) ఎస్ఎస్ 24 (అక్టోబర్ 23-సెప్టెంబర్ 24) కోసం ప్రాథమిక చక్కెర ఉత్పత్తి (నికర) 31.7 మిలియన్ టన్నులుగా అంచనా వేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరకును పెద్ద ఎత్తున పండిస్తారు. అయితే ఈ ఏడాది ఈ రాష్ట్రాల్లో చెరకు సాగు తగ్గింది. ఇది ఉత్పత్తి అంచనాలను మరింత తగ్గించే ప్రమాదం ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతర్జాతీయ ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి, కానీ ఇది దేశీయ చక్కెర ధరలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అయితే రాబోయే రాష్ట్రాలు/ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం తప్ప, ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం తీవ్రమైన పెరుగుదలను నిరోధించనుందని స‌మాచారం. 

click me!