మళ్లీ ప్రధాని మోదీనే... రూ.75లక్షల కోట్లు పెరిగిన దేశ సంపద

Published : May 23, 2019, 06:30 PM IST
మళ్లీ ప్రధాని మోదీనే... రూ.75లక్షల కోట్లు పెరిగిన దేశ సంపద

సారాంశం

భారత ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ఎన్నికయ్యారు. గత ఎన్నికలతో పోలిస్తే... అంతకంటే ఎక్కువగా పట్టం కట్టారు.  అయితే 2014లో మోదీ గెలిచిన రోజు నుంచి స్టాక్‌మార్కెట్లు రూ.75.25 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. 

భారత ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ఎన్నికయ్యారు. గత ఎన్నికలతో పోలిస్తే... అంతకంటే ఎక్కువగా పట్టం కట్టారు.  అయితే 2014లో మోదీ గెలిచిన రోజు నుంచి స్టాక్‌మార్కెట్లు రూ.75.25 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. ఈ ఐదేళ్లలో బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 61% పెరిగింది.  2014, మే 16 నుంచి నేటి వరకు సెన్సెక్స్‌ను విశ్లేషిస్తే 14,689.65 పాయింట్లు లేదా 60.80 శాతం వృద్ధి నమోదు చేసింది. 

ఇక తాజా ఎన్నికల ఫలితాలు విడుదలైన 2019, మే 23న సూచీ జీవితకాల గరిష్ఠం 40,124.96 పాయింట్లను తాకింది. ఈ ఐదేళ్లలో బీఎస్‌ఈలో నమోదైన సంస్థల మార్కెట్‌ విలువ రూ.75 లక్షల కోట్ల నుంచి రూ.150.25 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఏకంగా రూ.75.25 లక్షల కోట్ల పెరుగుదల అన్నమాట.

ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో గురువారం సెన్సెక్స్‌ 1,014.75 పాయింట్లు ఎగిసి 40,124.96కు చేరుకుంది. అయితే మదుపర్లు లాభాలు స్వీకరించడంతో 298.82 పాయింట్ల నష్టంతో 38,811.39 వద్ద ముగిసింది

PREV
click me!

Recommended Stories

Business Idea: ఉన్న ఊరిలో ఉంటూనే నెల‌కు రూ. ల‌క్ష సంపాదించాలా.? జీవితాన్ని మార్చే బిజినెస్‌
Highest Car Sales: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే, రేటు కూడా తక్కువే