వరుసగా 2వ రోజు కూడా అమ్మకాల సెగ.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్.. 15700 దిగువకు నిఫ్టీ

By asianet news teluguFirst Published Jul 1, 2021, 5:01 PM IST
Highlights

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాల్గవ  సెషన్‌లో కూడా నష్టాలతో ముగిసాయి. రోజంతా  అస్థిరతతో కొనసాగిన సెన్సెక్స్ 164 పాయింట్లు క్షీణించి 52,318 వద్ద ముగియగా, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 15,680 వద్ద ముగిసింది.

నేడు వారంలో నాల్గవ ట్రేడింగ్ రోజున అంటే గురువారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఒక రోజు అస్థిరత తరువాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 164.11 పాయింట్లు (0.31 శాతం) క్షీణించి  52,318.60 వద్ద ముగిసింది.

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 41.50 పాయింట్లతో 0.26 శాతం క్షీణించి 15,680.00 వద్ద ముగిసింది. గత వారం బిఎస్ఇ 30-షేర్ సెన్సెక్స్ 580.59 పాయింట్లతో 1.10 శాతం పెరిగింది.  

నేడు డాక్టర్ రెడ్డీస్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, సన్ ఫార్మా స్టాకులు లాభాలతో ముగిశాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, విప్రో అండ్ శ్రీ సిమెంట్ షేర్లు నష్టాలతో ముగిశాయి. 

 సెక్టోరియల్ ఇండెక్స్ చూస్తే  నేడు ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, పిఎస్‌యూ బ్యాంకులు లాభాలతో  ముగిసాయి. మరోవైపు ఐటి, రియాల్టీ, మీడియా, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్ నష్టాలతో ముగిశాయి.

also read బంగారు-వెండి ధరలలో పెద్ద మార్పు.. నేడు 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా ?

 టాప్ 10 కంపెనీలలో ఆరు మార్కెట్ క్యాపిటలైజేషన్ 
గత వారం సెన్సెక్స్  టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) లో  రూ.1,11,220.5 కోట్లకు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) అండ్ ఇన్ఫోసిస్ ఈ కాలంలో అత్యధిక లాభాలను ఆర్జించాయి.

టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సమీక్షించిన వారంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ వాల్యు క్షీణించింది. 

 నేడు ఉదయం స్టాక్ మార్కెట్ 10.57 పాయింట్లు (0.02 శాతం) స్వల్పంగా క్షీణించి సెన్సెక్స్ 52472.14 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 15720.40 స్థాయిలో 1.10 పాయింట్లు (0.01 శాతం) పడిపోయింది.

స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. కాస్త హెచ్చు తగ్గుల తరువాత సెన్సెక్స్ 66.95 పాయింట్లు (0.13 శాతం) తగ్గి 52,482.71 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 26.95 పాయింట్లు (0.17 శాతం) తగ్గి 15,721.50 వద్ద ముగిసింది.

ముఖ్యంగా క్యూ4 ఫలితాలతో వొడాఫోన్‌ ఐడియా 10 శాతం కుప్పకూలింది. వొడాఫోన్ ఐడియా 2021 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 7,022.8 కోట్ల రూపాయల నికర నష్టాన్నినివేదించింది.

click me!