నేడు నష్టలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్-నిఫ్టీ డౌన్.. అత్యధిక స్థాయికి ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు..

By asianet news teluguFirst Published Jul 26, 2021, 5:35 PM IST
Highlights

గత సోమవారం నష్టాలతో మొదలై చివరకు స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిసింది. అయితే ఈ  సోమవారం కూడా లాభాలతో మార్కెట్‌ ప్రారంభం అవుతుందని ఆశించగా  షేర్ మార్కెట్‌ ప్రారంభమైన కాసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించారు. 

నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు  నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 123.53 పాయింట్లు (0.23 శాతం) క్షీణించి 52,852.27 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 31.60 పాయింట్లు (0.20 శాతం) తగ్గి 15,824.45 వద్ద ముగిసింది. గత వారం బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 164.26 పాయింట్లు( 0.30 శాతం) క్షీణించింది.   

నేడు ట్రేడింగ్ సమయంలో  ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అత్యధిక స్థాయి 687.80 కి చేరుకున్నాయి. అంతకుముందు రోజు 676.65 వద్ద ముగిసింది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ .4,68,708.34 కోట్లు. 2021-2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకు స్వతంత్ర నికర లాభం 78 శాతం పెరిగి రూ .4616 కోట్లకు చేరుకుంది. కాగా గత ఏడాది  ఈ కాలంలో రూ .2599.2 కోట్లుగా ఉంది.  

ఈ వారంలో  కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ ధోరణి ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ దిశని నిర్ణయిస్తుంది. విశ్లేషకులు ప్రకారం వడ్డీ రేటుపై యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని పెట్టుబడిదారులు గమనిస్తారు. అంతే కాకుండా ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి అస్థిరత, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి ధోరణిపై కూడా  చూస్తారు.

ఎస్‌బిఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో, డివిస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలతో ముగిసింది. మరోవైపు విప్రో, ఎస్‌బిఐ, రిలయన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బిపిసిఎల్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

also read ఐటిఆర్ దాఖలు చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే మీకు నష్టం జరుగవచ్చు..

సెక్టోరియల్ ఇండెక్స్  పరిశీలిస్తే నేడు మీడియా, మెటల్, ఐటి, ఫార్మా మినహా అన్ని రంగాలు క్షీణించాయి. వీటిలో ఆటో, బ్యాంక్, ఫైనాన్స్ సర్వీస్, పిఎస్‌యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ ఎఫ్‌ఎంసిజి ఉన్నాయి.

ఉదయం దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత వారం కూడా నష్టాలతో మొదలై చివరకు లాభాలతో స్టాక్‌ మార్కెట్‌ ముగిసింది. ఈ సోమవారం కూడా స్టాక్ మార్కెట్‌ లాభాలతో ప్రారంభం అవుతుందని ఆశించగా స్టాక్ మార్కెట్‌ ప్రారంభమైన కాసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించారు.  

నేడు ఉదయం స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 170.92 పాయింట్లు (0.32 శాతం) తగ్గి 52804.88 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ  44.70 పాయింట్లు (0.28 శాతం) క్షీణతతో 15811.30 వద్ద ప్రారంభమైంది.

గత వారం స్టాక్ మార్కెట్  చివరి ట్రేడింగ్ రోజు సెన్సెక్స్ 138.59 పాయింట్లు పెరిగి 0.26 శాతం పెరిగి 52,975.80 వద్ద ముగిసింది. మరోవైపు 32.00 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,856.05 వద్ద ముగిసింది. 

click me!