
Stock Market LIVE Updates: ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మార్చి 28న ఫ్లాట్ నోట్‌లో ప్రారంభమవుతోంది. ఉదయం 09:16 గంటలకు సెన్సెక్స్ 5.67 పాయింట్లు లాభపడి 57367.87 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6.80 పాయింట్లు లాభపడి 17159.80 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి. దాదాపు 1271 షేర్లు పురోగమించగా, 778 షేర్లు క్షీణించాయి. 129 షేర్లు మారలేదు. కాగా మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం 10.15 గంటలకు Nifty 108.20 పాయింట్లు నష్టపోయి 17044.80 వద్ద ట్రేడవుతోంది. Sensex 403.99 పాయింట్లు నష్టపోయి 56958.21 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. Nifty Bank -344.30 పాయింట్లు నష్టపోయి 35065.80 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీలో సిప్లా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధాన లాభాల్లో ఉండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నష్టపోయాయి.
మార్కెట్లను ప్రభావితం చేస్తున్న అంశాలు ఇవే...
US మార్కెట్ పతనం
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా, ముడి చమురు ధర ఇప్పటికీ బ్యారెల్కు 115 డాలర్ల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్ సైతం 0.16 క్షీణించింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపించనుంది.
యూరప్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది
యూరప్ మార్కెట్లలో కూడా మిశ్రమ ప్రభావం కనిపిస్తోంది. జర్మనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.22 శాతం లాభపడగా, ఫ్రెంచ్ మార్కెట్ 0.03 శాతం క్షీణించింది. ఇది కాకుండా, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కూడా 0.21 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి
ఆసియా మార్కెట్లలో సింగపూర్ మినహా మిగిలినవన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీలో 0.02 శాతం పెరుగుదల ఉండగా, జపాన్‌కు చెందిన నిక్కీలో 0.79 శాతం క్షీణించింది. ఇది కాకుండా, హాంకాంగ్ ఎక్స్ఛేంజ్‌లో 0.58 శాతం, తైవాన్‌లో 1.5 శాతం క్షీణత ఉంది. దక్షిణ కొరియా కూడా 0.49 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 1.29 శాతం క్షీణించాయి.
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మరోసారి అమ్మకాల బాట పట్టారు. గత వారం చివరి ట్రేడింగ్ రోజు (ఎఫ్‌ఐఐలు) రూ.1,507.37 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. అయితే దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,373.02 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్‌ను భారీ పతనం నుంచి కాపాడారు.