
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 52 వేలు దాటేసి రూ. 53 వేల వైపు దూసుకుపోతోంది. అయితే సోమవారం బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. సోమవారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక వెండి విషయానికొస్తే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సోమవారం (మార్చి 28, 2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..!
సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది. బంగారం అందుకే గత కొద్దిరోజులుగా పెరుగుతోంది.
సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200గా ఉంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 52,590 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 52,840కు చేరింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 52 ,590 వద్ద ఉంది. ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 52,590గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,590గా ఉంది. ఇక విశాఖపట్నంలో సైతం ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
సోమవారం న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,900 వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 68,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,400 కాగా, కేరళ, బెంగళూరులో కూడా కిలో వెండి ధర రూ. 73,400 వద్ద ఉంది. హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ. 73,400 వద్ద ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,400గా నమోదైంది.