భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 5 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 10:57 AM IST
Highlights

స్టాక్ మార్కెట్లు భారీ పతనమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు క్షీణించి రూ.74.45 పైసలతో ఉంది

స్టాక్ మార్కెట్లు భారీ పతనమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు క్షీణించి రూ.74.45 పైసలతో ఉంది..

వీటితో పాటు ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బాగా నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అమెరికా, చైనా మధ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది.

ఈ రెండు దేశాలు వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై గట్టి ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్ 959 పాయింట్లు నష్టపోయి 33801.82 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 296.55 పాయింట్లు నష్టపోయి 10163.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ఈ నేపథ్యంలో గురువారం కేవలం 5 నిమిషాల్లో సుమారు రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వోడాఫోన్ ఐడియా, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ తదితర కంపెనీలు బాగా నష్టపోతున్నాయి. 
 

click me!