నష్టాల ఊబీలో జెట్ ఎయిర్‌వేస్.. జీతాలు కూడా చెల్లించలేక

By sivanagaprasad kodatiFirst Published Oct 10, 2018, 2:20 PM IST
Highlights

ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆర్థికపరమైన ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళా తీయగా... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా,అప్పుల ఊబీలో కూరుకుపోయాయి. 

ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆర్థికపరమైన ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళా తీయగా... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా,అప్పుల ఊబీలో కూరుకుపోయాయి. ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది జెట్ ఎయిర్‌వేస్. దీంతో సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంది.

తమ పైలట్లకు, ఎయిర్‌క్రాఫ్ట్‌ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదు.. ఆ మాసానికి రావాల్సిన జీతాలను అక్టోబర్ 11, 26వ తేదీల్లో రెండు విడతలుగా చెల్లిస్తామని సెప్టెంబర్ 6న జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం తెలిపింది.

అయితే ముందుగా చెప్పిన దాని ప్రకారం రేపు జీతాలు చెల్లించలేమని... వీలైనంత త్వరగా వేతనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సంస్థ ప్రకటించింది. అప్పటి వరకు సిబ్బంది సంయమనం పాటించాల్సిందిగా కోరింది.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ ఆగస్టు నెలలో ఉద్యోగులకు 75 శాతం మాత్రమే వేతనం ఇచ్చింది. మిగతా 25 శాతాన్ని తర్వాత చెల్లిస్తామని చెప్పింది. ఇప్పుడు అక్టోబర్ 11న సెప్టెంబర్ నెలకు సంబంధించిన 50 శాతం వేతనం, ఆగస్టులో చెల్లించాల్సిన 25 శాతం వేతనం రెండూ బకాయి పడింది. పైలట్స్ యూనియన్, నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్‌తో సమావేశమై జీతాలు ఎప్పుడు చెల్లించాలనే విషయంపై ఓ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. 
 

click me!