ఎస్‌బి‌ఐ బ్యాంక్ యోనో యాప్ డౌన్.. నకిలీ సైట్‌లను నమ్మవద్దని కస్టమర్లకు హెచ్చరిక..

By S Ashok KumarFirst Published Dec 4, 2020, 12:17 PM IST
Highlights

 ఎస్‌బి‌ఐ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని బ్యాంక్ వివరించింది. 

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో మూసివేయబడింది. ఎస్‌బి‌ఐ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని బ్యాంక్ వివరించింది.

ప్రస్తుతం యోనో యాప్‌కు బదులుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్ నుంచి బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని బ్యాంక్ వినియోగదారులకు తెలిపింది.

యాప్ డౌన్ అయినప్పుడు ప్రజలు నకిలీ సైట్‌లను నమ్మవద్దని ఎస్‌బి‌ఐ బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించింది. మీరు బ్యాంక్ కస్టమర్ కేర్ తో మాట్లాడాలనుకుంటే 1800 11 2211, 1800 425 3800 లేడ్డ 080 26599990 నంబర్లకు సంప్రదించవచ్చని సూచించింది.

మీరు ఈ నంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోవచ్చు. ఎస్‌బి‌ఐ ఇటీవల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్  చేసింది. ఆ సమయంలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ ఉపయోగించడంలో ఉన్న ఇబ్బందుల గురించి బ్యాంక్ వినియోగదారులకు తెలియజేసింది.

also read 

బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన ఆన్‌లైన్ సేవలను అందిస్తుందని ఎస్‌బిఐ పేర్కొంది.

ఎస్‌బిఐకి దేశమంతటా 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రోజుకు 4 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం, 55% లావాదేవీలు మాత్రమే డిజిటల్ చానెళ్ల ద్వారా జరుగుతున్నాయి.

యోనో యాప్ కి 2.76 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టెక్నికల్ కారణంగా వినియోగదారులు యోనోలో లాగిన్ అయినప్పుడు M005 లోపం కనిపిస్తుందని చెప్పారు.

గురువారం దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా ఇలాంటి అవాంతరాల కారణంగా ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించకుండా ఆర్‌బిఐ నిలిపివేసింది. ఈ పరిమితి 3 నుండి 6 నెలల వరకు ఉంటుంది.  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ ఇటీవల చాలాసార్లు విఫలమైంది.

 గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్‌ బ్యాంక్‌ తీవ్రంగా స్పందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్‌ కార్యకలాపాలు ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది.

సాంకేతిక సమస్యలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్‌ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్‌ వ్యాపార లావాదేవీలు, ఇతర ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ సూచించింది.

click me!