రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం : ఫార్చ్యూన్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో టాప్ ప్లేస్ లోకి..

Ashok Kumar   | Asianet News
Published : Dec 03, 2020, 05:40 PM ISTUpdated : Dec 03, 2020, 10:07 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం : ఫార్చ్యూన్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో టాప్ ప్లేస్ లోకి..

సారాంశం

 ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండవ స్థానంలో ఉందని ఫార్చ్యూన్ ఇండియా బుధవారం తెలిపింది.

ఫార్చ్యూన్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండవ స్థానంలో ఉందని ఫార్చ్యూన్ ఇండియా బుధవారం తెలిపింది.

వీటి తరువాత 3వ స్థానంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ జాబితాలో నాల్గవ స్థానంలో, రెండవ అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. (బీపీసీఎల్) ఐదో స్థానంలో ఉంది.

also read టాంగా నుండి ప్రారంభమై వేల కోట్ల వ్యాపారంలోకి: మసాలా కింగ్, ఎండిహెచ్ యజమాని జీవిత చరిత్ర.. ...

ఈ జాబితాను కోల్‌కతాకు చెందిన ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూపులో భాగమైన ఫార్చ్యూన్ ఇండియా ప్రచురించింది. ఈ జాబితాలో టాటా మోటార్స్ ఆరో స్థానంలో, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బంగారు ప్రాసెసింగ్‌లో ఏడవ స్థానంలో ఉంది.

దేశంలో అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎనిమిదో స్థానంలో, ఐసిఐసిఐ బ్యాంక్ తొమ్మిదవ స్థానంలో, లార్సెన్ & టౌబ్రో 10వ స్థానంలో ఉన్నాయి. ఆగస్టులో విడుదలైన గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలలో ఆర్‌ఐఎల్ ఒకటి.

 ప్రపంచ జాబితాలో ఐఓసి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 34 స్థానాలు తగ్గి 151 వ స్థానానికి చేరుకోగా, ఒఎన్‌జిసి 30 స్థానాలు తగ్గి 190వ స్థానానికి చేరుకుంది.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే