ఇటీవల ఆనంద్ మహీంద్ర పంచుకున్న ఓ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం యువతతోపాటు పెద్దవాళ్లు కూడా విపరీతంగా సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫొన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం లేదా, ఫోన్లోనే వీడియోలు చూస్తూ గడపడం లాంటి చేస్తూ తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
బెంగళూరు: మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఎంతో చురుగ్గా ఉంటున్నారు. సామాజిక అంశాలు, యువతలో స్ఫూర్తినిచ్చే సందేశాలతో కూడిన ట్వీట్లను చేస్తూ ఆయన ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల ఆయన పంచుకున్న ఓ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం యువతతోపాటు పెద్దవాళ్లు కూడా విపరీతంగా సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫొన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం లేదా, ఫోన్లోనే వీడియోలు చూస్తూ గడపడం లాంటి చేస్తూ తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
ఇలాంటివారిని ఉద్దేశించే ఆనంద్ మహీంద్ర ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సెల్‌ఫోన్‌కు చెప్పులను పోలి ఉన్న కవర్లు అయితే బాగుంటుందని ఆ ఫొటోను పంచుకున్నారు. మనకు సెల్‌ఫోన్ వినియోగంలో నియంత్రణ లేకపోతే ఇలాంటి కవర్ సెల్‌ఫోన్లకు అమర్చాలని సూచించారు.
అప్పుడైతేనే మనం ఎంత ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపితే అన్నిసార్లు చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఏడాది జనవరిలో ఆనంద్ మహీంద్రా ఈ ఫొటోను పంచుకున్నప్పటికీ.. ఇంకా ఈ ఫొటో వైరల్ అవుతూనే ఉంది. వాట్సప్‌వండర్‌బాక్స్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ఫొటోను ట్వీట్ చేశారు.