శుక్రవారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
హైదరాబాద్: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్కైవర్త్ తెలంగాణలో తన ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
also read సరిలేరు నీకెవ్వరు...రిలయన్స్ అరుదైన ఘనత
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ విషయమై స్కైవర్త్ కంపెనీ తెలంగాణలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనున్నది. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ.700 కోట్లతో 50 ఎకరాల్లో అత్యాధునిక ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటుచేయనున్నది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి కానున్నది. అదేవిధంగా భారత్‌లో అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల్లో ఒకటి కానున్నది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్.. మెట్జ్ బ్రాండ్ ఎల్‌ఈడీ టీవీలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్నాయి. రెండోదశ విస్తరణలో ఎలక్ట్రిక్ వా హనాల్లో ఉపయోగించే తాజారకం లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల తయారీని చేర్చనున్నది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని స్కైవర్త్‌గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ అన్నారు. స్కైవర్త్‌ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి స్కైవర్త్ పనిచేస్తున్నదని తెలిపారు.
స్కైవర్త్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెం ట్ మిస్టర్ వాంగ్ జెంజున్ మాట్లాడుతూ...స్కైవర్త్ ప్రపంచ విస్తరణలో భాగంగా భారతదేశం వ్యూహాత్మక మార్కెట్ అని తెలిపారు. స్కైవర్త్, మెట్జ్ నాణ్యత, తాజా టెక్నాలజీ, ఏఐవోటీ ఉత్పత్తులు భారతీయ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయని వివరించారు. భారతీయ మార్కెట్లతో దశలవారీగా భారీగా పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ స్కైవర్త్ హైదరాబాద్‌ను తన ఉత్పాదక గమ్యస్థానంగా ఎంచుకున్నదని.. దీనిద్వారా ఐదువేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
also read టాప్-10 అత్యంత ధనవంతుల్లో ముకేష్ అంబాని...
నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోపాటు శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాలతో హైదరాబాద్ నగరానికి ఉన్న కనెక్టివిటీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ను ఎంచుకున్న స్కైవర్త్ కంపెనీ చైర్మన్, బృందానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీఇచ్చారు.