టాప్-10 అత్యంత ధనవంతుల్లో ముకేష్ అంబాని...

By Sandra Ashok KumarFirst Published Nov 30, 2019, 10:46 AM IST
Highlights

 60 బిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆస్తితో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ది రియల్-టైమ్ బిలియనీర్ల టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈఓ జెఫ్ బెజోన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోమారు సత్తా చాటారు. ఆయన వ్యక్తిగత సంపాదనలో దూసుకుపోతున్నారు. 60 బిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆస్తితో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ది రియల్-టైమ్ బిలియనీర్ల టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. 

also read  ఆయనే నా గురువు, నా రోల్ మోడల్ ...అంటూ ఎమోషనల్ పోస్ట్

ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈఓ జెఫ్ బెజోన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2019 సంవత్సరానికి పోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసిన తర్వాత గణాంకాల పకారం 60 బిలియన్ల డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ తొమ్మిదో ర్యాంక్ పొందారు.

గురువారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ మొత్తం రూ.10 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో ముకేశ్ అంబానీ టాప్ -10 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ప్రస్తుత జాబితాలో అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ (113 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్(107.4 బిలియన్ డాలర్లు), 107.2 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ అర్నాల్డ్ మూడో స్థానంలో ఉన్నారు. 

also read ఆ మూడు బీమా సంస్థల విలీనం...15 వేల ఉద్యోగాలకు ఎసరు...

తర్వాతీ స్థానాల్లో ఎల్‌వీఎంహెచ్ యోయిటల్ సీఈవో హెన్నెస్సీ లూయిస్ వ్యూట్టిన్ (107.2 బిలియన్ డాలర్లు), బర్క్‌షైర్ హత్‌వే సీఈవో వారెన్ బఫెట్ (86.9 బిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జుకర్‌బర్గ్ (74.9 బిలియన్ డాలర్లు), అమాన్‌సియో ఓర్టేగా ఫౌండర్, ఇండిటెక్స్ ఫ్యాష్ గ్రూపు ఆఫ్ చైర్మన్ (69.3 బిలియన్ డాలర్లు), ఓరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ (69.2 బిలియన్ డాలర్లు), కార్లోస్ స్లిమ్ హెలు (60.9 బిలియన్ డాలర్లు), అల్ఫాబెట్ లారీ పేజ్ సీఈవో (59.6 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
 

click me!