వరుసగా 3వ రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. నేడు 10 గ్రాములకు ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Nov 6, 2020, 6:07 PM IST
Highlights

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం ప్రపంచ విలువైన లోహల ధరల పెరుగుదల కారణంగా బంగారు ధరలు శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ.791 పెరిగి రూ.51,717కు చేరుకున్నాయి. 

నేడు వరుసగా మూడవ రోజు కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం ప్రపంచ విలువైన లోహల ధరల పెరుగుదల కారణంగా బంగారు ధరలు శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ.791 పెరిగి రూ.51,717కు చేరుకున్నాయి.

అంతకుముందు ట్రేడింగ్ రోజున వెండి ధర కిలోకు రూ.62,431తో పోలిస్తే నేడు వెండి ధర రూ.2,147 పెరిగి కిలోకు రూ.64,578 కు చేరింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పెరుగుదల కారణంగా రూపాయి విలువ శుక్రవారం డాలర్‌తో  పోలిస్తే 28 పైసలు పెరిగి 74.08 (తాత్కాలిక) వద్ద ముగిసింది.

also read 

స్టాక్ మార్కెట్లో పెరుగుదల, డాలర్ బలహీనత, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధిస్తారనే ఆశల వల్ల స్థానిక కరెన్సీకి సపోర్ట్ లభించిందని వ్యాపారులు తెలిపారు.

ప్రపంచ బంగారు మండలి నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 653 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని దీంతో బంగారం నిల్వలో భారతదేశం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇది మొత్తం విదేశీ మారక నిల్వలలో 7.4 శాతం.

చైనా తరువాత భారతదేశం అత్యాదికంగా బంగారం కొనుగోలు చేసే దేశాలలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో బంగారం దిగుమతి ఆగస్టులో 3.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో 1.36 బిలియన్ డాలర్లు మాత్రమే. భారతదేశంలో బంగారంపై  12.5 శాతం దిగుమతి సుంకాన్ని, మూడు శాతం జీఎస్టీ ఉంది.

click me!