ఎలాన్ మస్క్ కు షాక్...టెస్లా కంపెనీకి చెందిన 75 వేల మంది డేటా చోరీ...మాజీ ఉద్యోగుల పనే అని నిర్ధారణ..

Published : Aug 22, 2023, 01:48 PM IST
ఎలాన్ మస్క్ కు షాక్...టెస్లా కంపెనీకి చెందిన 75 వేల మంది డేటా చోరీ...మాజీ ఉద్యోగుల పనే అని నిర్ధారణ..

సారాంశం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో డేటా చౌర్యానికి సంబంధించిన ఘటన, కలకలం రేపుతుంది. ఇప్పటికే 75 వేల మంది డేటా చోరీకి గురైనట్లు మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. దీంతో కంపెనీ విశ్వసనీయతపై క్వశ్చన్ మార్క్ ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మే నెలలో 75 వేల మందిని ప్రభావితం చేసిన డేటా లీక్ అంశం టెస్లా కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ నుంచి సుమారు 75,000 మందికి సంబంధించినటువంటి డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యవహారం సీరియస్ గా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ డేటా లీక్‌లో కంపెనీకి చెందిన చాలా మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన అటార్నీ జనరల్ కార్యాలయం ఈ మేరకు నోటీసు జారీ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది.

ఇద్దరు మాజీ కంపెనీ ఉద్యోగులు 75,000 మందికి పైగా వ్యక్తుల వ్యక్తిగత వివరాలను విదేశీ మీడియా సంస్థకు లీక్ చేసినట్లు అంతర్గత దర్యాప్తులో తేలిందని ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా తెలిపింది.  టెస్లా ,  IT భద్రత , డేటా రక్షణ విధానాలను ఉల్లంఘిస్తూ, ఇద్దరు మాజీ కంపెనీ ఉద్యోగులు సమాచారాన్ని దుర్వినియోగం చేసి మీడియాకు లీక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

కంపెనీ ప్రకారం, ఒక విదేశీ మీడియా అవుట్‌లెట్, హాండెల్స్‌బ్లాట్ మే 10, 2023న టెస్లాకు చెందిన సుమారు  75 వేల మంది రహస్య సమాచారాన్ని అందుకున్నట్లు టెస్లాకు తెలియజేసింది. దీంతో కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అంతేకాదు ప్రస్తుతం డేటాలీక్ కు సంబంధించి  వార్త దావానంలా పాకినందుకు కంపెనీ దీనిపై  ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టే అవకాశం కల్పిస్తోంది. 

ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించి వారిపై దావా వేసినట్లు టెస్లా తెలిపింది. నిందితుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, ఎలోన్ మస్క్ కంపెనీ కూడా ఇప్పుడు కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగుల డేటాను ఉల్లంఘించరాదని కోర్టు నుండి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎలాన్ మస్క్ ఈ విషయంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది.  కంపెనీ విశ్వసనీయతకు సంబంధించిన విషయం కావడంతో దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాదు ఎలాన్ మస్క్ ప్రస్తుతం డేటా లీకుకు సంబంధించి,  తమ కంపెనీపై విదేశీ కుట్ర కూడా జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు