వారెవా.. భారీగా తగ్గిన బంగారం ధర.. కొనడానికి మంచి ఛాన్స్.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే..?

Published : Nov 05, 2022, 10:46 AM ISTUpdated : Nov 05, 2022, 10:49 AM IST
వారెవా.. భారీగా తగ్గిన బంగారం ధర..  కొనడానికి మంచి ఛాన్స్.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే..?

సారాంశం

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అందరికీ తెలిసిన విషయమే. రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనయ్యే బంగారం ధర కరోనా కాలంలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.  

బంగారాన్ని సాధారణంగా మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు, అయితే రోజురోజుకు పెరుగుతు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు దీపావళి తరువాత  భారీగా పతనమై నేడు మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,150గా ఉంది.

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అందరికీ తెలిసిన విషయమే. రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనయ్యే బంగారం ధర కరోనా కాలంలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.  

 మరోవైపు భారతదేశంలో బంగారానికి చాలా మంచి డిమాండ్ ఉంది, అందుకే  మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనుగోలు శుభ కార్యక్రమాల సమయంలో అధికంగా జరుగుతుంటుంది.

మార్కెట్‌లో నేటి బంగారం ధరలను పరిశీలిస్తే, ఒక గ్రాము (1GM) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర - రూ. 4,615, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,034 ఉంది. 

పది గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర - రూ. 46,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,340 ఉంది. 

బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ. 46,150 అయితే చెన్నైలో రూ. 47,170, ముంబైలో  రూ. 46,100, కోల్‌కతాలో దీని ధర  రూ. 46,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర రూ.46,250గా ఉంది. 

మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.59,500 పలుకుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తలెత్తే వ్యత్యాసాలను బట్టి భారత్‌లో వెండి ధర మారుతూ ఉంటుంది. అలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది.

బెంగళూరులో ఈరోజు వెండి ధర 1 కేజీకి రూ. 59,500. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,000 కాగా ఢిల్లీలో రూ. 59,500, ముంబైలో రూ.59,500, కోల్‌కతాలో రూ. 65,000 ఉన్నాయి.

దసరా, దీపావళి తరువాత పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం కొనేవారికి ఇప్పుడు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. నేడు బంగారం ధరలు భారీగా దిగోచ్చాయి. ఈ రోజు 10 గ్రాముల ధర ఏకంగా రూ.600 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ.50,290కు పడిపోయింది.

వెండి ధర విషయానికొస్తే కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.400 పెరిగి రూ.64,400కు చేరుకుంది.

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST, విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారానికి చెందిన ధరలు. 

PREV
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !