నిన్న రికార్డు స్థాయిలో.. నేడు నష్టాలతో స్టాక్ మార్కెట్ ఓపెన్.. సెన్సెక్స్ 119 పాయింట్లు డౌన్..

By asianet news teluguFirst Published Aug 17, 2021, 11:02 AM IST
Highlights

మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. తరువాత ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ 10.50 పాయింట్ల స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది.
 

నిన్న అత్యధిక స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు వారంలోని రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ ఉదయం 119.91 పాయింట్లు (0.22 శాతం) తగ్గి 55462.67 స్థాయిలో ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 37.80 పాయింట్లు (0.23 శాతం) తగ్గి 16525.20 వద్ద ప్రారంభమైంది.

ట్రేడింగ్ ప్రారంభంలో  897 కంపెనీల షేర్లు పెరిగాయి, 782 కంపెనీల షేర్లు క్షీణించాయి, 97 కంపెనీల షేర్లు మారలేదు. సోమవారం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 55680.75, నిఫ్టీ 16,589.40 రికార్డు స్థాయిని తాకాయి.  

గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు (2.13 శాతం) లాభపడింది. చాలా కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి ప్రపంచ ధోరణిపై ఉంటుంది.  ప్రధానంగా ప్రపంచ ధోరణి దేశీయ మార్కెట్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. ముహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ గురువారం మూసివేయబడుతుంది.

also read త్వరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బిగ్ డీల్‌.. 20 శాతం వాటాను దక్కించుకునేందుకు చర్చలు..

 నేడు, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,  డాక్టర్ రెడ్డి, రిలయన్స్, భారతీ  ఎయిర్ టెల్,  హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, ఎన్టిపిసి, కోటక్ బ్యాంక్, టి‌సి‌ఎస్ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్,ఎం&ఎం, ఐ‌టి‌సి, టాటా స్టీల్, ఎస్‌బి‌ఐ, ఎల్&టి, హెచ్‌డి‌ఎఫ్‌సి, హెచ్‌సి‌ఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ  బ్యాంక్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ షేర్లు నష్టాలతో  ప్రారంభమయ్యాయి.  
 
ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 55763.74 స్థాయిలో 181.16 పాయింట్లు (0.33 శాతం) పెరిగింది. నిఫ్టీ 28.80 పాయింట్లు (0.17 శాతం) పెరిగి 16534.20 వద్ద ఉంది.

   సోమవారం  స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల తర్వాత అత్యధిక స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 145.29 పాయింట్లు (0.26 శాతం) పెరిగి 55,582.58 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 33.95 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 16,563.05 వద్ద ముగిసింది. 

click me!