స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 52000పైకి.. 15700 దాటిన నిఫ్టీ..

Ashok Kumar   | Asianet News
Published : Jun 22, 2021, 04:51 PM IST
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 52000పైకి.. 15700 దాటిన నిఫ్టీ..

సారాంశం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.   

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారంలోని రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం ఉదయం రికార్డు స్థాయికి చేరుకున్న తరువాత లాభాలను కోల్పోయి చివరికి స్వల్ప పెరుగుదలతో ముగిసింది. నేడు కాస్త అస్థిరత తరువాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 14.25 పాయింట్లు (0.03 శాతం) పెరిగి 52,588.71 వద్ద ముగిసింది.

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 26.25 పాయింట్లు (0.17 శాతం) స్వల్ప లాభంతో 15,772.75 వద్ద ముగిసింది. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 130.31 పాయింట్లు (0.24 శాతం) పడిపోయింది. నేడు  ట్రేడింగ్ సమయంలో స్టాక్ మార్కెట్ అత్యధిక స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 53000 మార్కును దాటి, నిఫ్టీ 15800 పైకి చేరింది.  దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఒకానొక దశలో 483 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 53,057 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డీలాపడ్డాయి. 

also read పెట్రోలు బంకు యజమాని బంపర్‌ ఆఫర్‌.. ఫ్రీగా 3 లీటర్ల పెట్రోలు.. క్యూకట్టిన ఆటో డ్రైవర్లు.. ...

గ్లోబల్ ఇండికేటర్స్, రుతుపవనాల పురోగతి, టీకా ప్రచారం ద్వారా ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశ నిర్ణయించబడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

ఇక బీఎస్‌ఈ 30 సూచీలో మారుతీ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, షేర్లు లాభాల్లో ముగిస్తే మరోవైపు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, హిందుస్తాన్ యునిలివర్, నెస్లే ఇండియా నష్టాల మీద ముగిశాయి. 

 సెన్సెక్స్ 235.07 పాయింట్లు (0.45 శాతం) పెరిగి ఉదయం 52809.53 స్థాయిలో ప్రారంభమైంది. నిఫ్టీ 76.00 పాయింట్ల (0.48 శాతం) లాభంతో 15822.50 వద్ద ప్రారంభమైంది. దీని తరువాత సెన్సెక్స్ ట్రేడింగ్ సమయంలో 53000 స్థాయిని తాకింది.

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!