కొనసాగుతున్న ఇంధన ధరల మంట.. నేడు మళ్ళీ రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

By asianet news teluguFirst Published Jun 22, 2021, 10:49 AM IST
Highlights

ప్రభుత్వ చమురు కంపెనీలు ఒక రోజు విరామం తరువాత నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెంచాయి. దీంతో డీజిల్ ధరపై  గరిష్టంగా 26 నుంచి 28 పైసలు పెరగగా, పెట్రోల్ ధర పై 27 నుంచి 28 పైసలు పెరిగింది. 
 

ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు స్థాయికి చేరుతున్న ఇంధన ధరలు ఒకరోజు విరామం తరువాత నేడు మళ్ళీ  పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సోమవారం స్థిరంగా ఉన్న  ఇంధన ధరలను చమురు కంపెనీలు మంగళవారం మరోసారి సవరించాయి.

దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 22 జూన్ మంగళవారం అంటే నేడు పెట్రోల్ ధర పై లీటరుకు 28 పైసలు, డీజిల్ ధర పై లీటరుకు 26 పైసలు పెరిగింది. చమురు ధరలు పెరిగిన తరువాత ఢీల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.50 చేరింది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ .88.23కు పెరిగింది.

పెట్రోల్ ధర ఒక నెలలో ఎంత పెరిగిందంటే ?
మే 4 నుండి చమురు ధరలు వేగంగా పెరిగాయి. గత  29 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.7.18 చేరగా, డీజిల్ ధర రూ .7.45 పెరిగింది.

నేడు ప్రధాన నగరాల్లో చమురు ధరలు

కోల్‌కతాలో పెట్రోల్ ధర నేడు రూ .97.38, డీజిల్ లీటరుకు రూ .91.08

చెన్నైలో పెట్రోల్ ధర నేడు రూ .98.65, డీజిల్ ధర రూ .92.83

 భోపాల్‌లో పెట్రోల్ ధర  రూ .105.72, డీజిల్ ధర లీటరుకు రూ .96.93

బెంగళూరులో పెట్రోల్ ధర నేడు రూ .100.76, డీజిల్ ధర లీటరుకు రూ .93.54

also read 

పాట్నాలో పెట్రోల్ ధర నేడు రూ .99.55, డీజిల్ ధర  లీటరుకు రూ .93.56

లక్నోలో పెట్రోల్ ధర రూ .94.70, డీజిల్ ధర రూ .88.64

చండీగఢ్ నేడు పెట్రోల్ ధర రూ 93,77, డీజిల్ లీటరు ధర రూ 87,87

రాంచీలో పెట్రోల్ ధర నేడు రూ .93.25, డీజిల్ ధర రూ .93.13

నోయిడాలో పెట్రోల్ ధర నేడు రూ .94.80, డీజిల్ ధర రూ .88.72

సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ?
జూన్ 21న సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢీల్లీ మార్కెట్లో పెట్రోల్ లీటరుకు రూ .97.22 ఉండగా, డీజిల్ లీటరుకు రూ .87.97గా ఉంది.  

దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చమురు కంపెనీలు జూన్ 20న పెట్రోల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్‌కు 28 పైసలు పెంచాయి. రాజధాని ఢీల్లీలో పెట్రోల్ లీటరుకు రూ .97 దాటితే, డీజిల్ లీటరుకు రూ .88కు చేరుకుంది.

 రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు రూ .100 దాటింది. అంతేకాకుండా, మెట్రో నగరాలలో ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే పెట్రోల్ లీటరుకు రూ.100 దాటింది.

 విదేశీ కరెన్సీ ధరలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఆధారంగా గ్యాసోలిన్, డీజిల్ రోజువారీ నవీకరించబడతాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సమీక్షించిన తరువాత ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజు ఉదయం వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలను నవీకరిస్తాయి.

click me!