కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 882.61 పాయింట్లు డౌన్..

By S Ashok KumarFirst Published Apr 19, 2021, 5:25 PM IST
Highlights

స్టాక్ మార్కెట్ నేడు ఉదయం 47,940 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,470 పాయింట్లు కుప్పకూలి చివరకు   882 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగిసింది.  

దేశీయ స్టాక్ మార్కెట్ నేడు నష్టాల్లో ముగిసింది. కోవిడ్-19  కేసుల పెరుగుదల, మరణాల సంఖ్య భారీగా పెరగడం,  వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూలు అమలు చేయడంతో పెట్టుబడిదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరికి భారీ పతనంతో ముగిసింది.

దీంతో బెంచ్ మార్క్ సూచిలు దాదాపు 2 శాతం నష్టాల్లో ముగిశాయి. ఉదయం 47,940 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,470 పాయింట్లు కుప్పకూలి చివరకు   882 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగిసింది.

 ఎన్ఎస్ఇ నిఫ్టీ 14,306 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన తరువాత 258.40 పాయింట్లు తగ్గి 14,359.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 2,73,810 కేసులు కొత్తగా  నమోదవ్వగా మరో 1,619 మంది మృతిచెందారు. కేసుల ఉద్ధృతితో అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. 

 వెటరన్ స్టాక్స్ గురించి మాట్లాడితే  ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో అన్ని షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వీటిలో సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డి, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఐటిసి, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతి, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, మొదలైనవి ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ మాత్రమే లాభాలను నమోదు చేశాయి. 

also read  

ప్రీ-ఓపెన్ సమయంలో స్టాక్ మార్కెట్ 
సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 491.98 పాయింట్లు (1.01 శాతం) తగ్గి 48340.05 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 276.50 పాయింట్లతో  (1.89 శాతం) తగ్గి 14341.40 వద్ద ఉంది.

గ్లోబల్ మార్కెట్ల సానుకూల ధోరణి కారణంగా  స్టాక్ మార్కెట్ శుక్రవారం  లాభాలతో ముగిసింది.  దీంతో సెన్సెక్స్ 28.35 పెరిగి 48,832.03 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 14,617.85 పాయింట్ల వద్ద ముగిసింది.

 

Sensex sinks 882.61 pts to end at 47,949.42; Nifty tanks 258.40 pts to 14,359.45

— Press Trust of India (@PTI_News)

ఈ వారం ఇవే స్టాక్ మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి.
ఈ వారం మొత్తం స్టాక్ మార్కెట్లలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. తక్కువ ట్రేడింగ్ సెషన్లతో స్టాక్ మార్కెట్ ధోరణి ఎక్కువగా కోవిడ్ -19 కేసులు, గ్లోబల్ క్యూస్, కంపెనీల త్రైమాసిక ఫలితాల ద్వారా నిర్ణయించబడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

అలాగే డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి దిశ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి, ముడి చమురు ధరలు కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి.  బుధవారం శ్రీ రామ్ నవమి కారణంగా స్టాక్ మార్కెట్ కి సెలవు ఉంటుంది. 
 

click me!