Sensex Gains: భారీ నష్టాల నుండి లాభాల్లోకి సెన్సెక్స్..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 02:29 PM IST
Sensex Gains: భారీ నష్టాల నుండి లాభాల్లోకి సెన్సెక్స్..!

సారాంశం

స్టాక్ మార్కెట్లు మంగళవారం (8 ఫిబ్రవరి 2022) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్, ఆ తర్వాత కుదురుకుంది. అయితే లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది.

స్టాక్ మార్కెట్లు మంగళవారం (8 ఫిబ్రవరి 2022) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్, ఆ తర్వాత కుదురుకుంది. అయితే లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం ఊగిసలాటలో కనిపించాయి. ప్రస్తుతం యూఎస్ ఫ్యూచర్స్ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో అక్కడి టెక్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా షేర్ 52 వారాల కనిష్టానికి పడిపోయింది.

ఆల్ టైమ్ గరిష్టం నుండి ఈ స్టాక్ 30 శాతం క్షీణించడం గమనార్హం. గూగుల్ స్టాక్ మూడు శాతం పడిపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణ భయాలు, ఉద్దీపనల ఉపసంహరణ, రేట్ల పెంపు వంటి ఆందోళనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, దేశీయంగా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ముడి చమురు ధరల పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపుతుంది.

సెన్సెక్స్ 57,799.67 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,925.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,058.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,279.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,306.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,043.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.22 సమయానికి 105 పాయింట్లు క్షీణించి 57,725 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 17,235 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల వరకు పతనమైనప్పటికీ, కిందపడినంత వేగంగా పుంజుకొని భారీ నష్టాన్ని తగ్గించుకుంది. అయితే మధ్యాహ్నం గం.12.50 సమయానికి మాత్రం సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఏకంగా 200 పాయింట్లు ఎగబాకింది.

నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పేయింట్స్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, టీసీఎస్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఉన్నాయి.

కాగా, సెన్సెక్స్, నిఫ్టీలు ఈవారం ఊగిసలాటలో ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. సెన్సెక్స్ గతవారం 2.5 శాతం ఎగిసి 58,645 పాయింట్ల వద్ద, నిఫ్టీ దాదాపు అంతేస్థాయిలో లాభపడి 17,516 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న మాత్రం నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వారం కూడా చివరి రెండు వారాలు నష్టపోయింది. వరుసగా మూడు రోజులు నష్టపోయిన మార్కెట్, నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్