భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్

By rajashekhar garrepallyFirst Published Apr 16, 2019, 4:35 PM IST
Highlights

మంగళవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల జోరు చూపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 369 పాయింట్ల లాభంతో 39,275 వద్ద, నిఫ్టీ 11,795 పాయింట్ల లాభంతో 105 పాయింట్ల వద్ద ముగిశాయి. 

ముంబై: మంగళవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల జోరు చూపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 369 పాయింట్ల లాభంతో 39,275 వద్ద, నిఫ్టీ 11,795 పాయింట్ల లాభంతో 105 పాయింట్ల వద్ద ముగిశాయి. 

మార్కెట్లో ముఖ్యంగా టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఐటీసీ సూచీలను పరుగులు పెట్టించాయి. నిఫ్టీ తొలిసారి 11,798 మార్కును తాకడం విశేషం. ఇక ప్రైవేటు బ్యాంక్‌ల సూచీ భారీ లాభాల్లో ట్రేడైంది. 

దేశీయి ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆరు నెలల గరిష్టంలో ట్రేడైంది. కంపెనీ అంచనాల కంటే 2.4శాతం వృద్ధి సాధించడంతో మదుపరుల్లో నమ్మకం పెరిగింది. 

ఇక కొత్తగా లిస్టైన మెట్రో పోలీస్ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడైంది. వరల్డ్ ఫండ్ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది. పాలీక్యాబ్ ఇండియా షేర్లు మంగళవారం లిస్టయ్యాయి. కాగా, మహావీర్ జయంతి, గుడ్‌ఫ్రై సందర్భంగా బుధవారం, శుక్రవారం భారత మార్కెట్లు మూతబడనున్నాయి. 

click me!