మార్చి 31లోగా సీనియర్ సిటిజన్లు ఈ బ్యాంకుల్లో ఫి‌క్స్‌డ్ డిపాజిట్ చేస్తే అదనంగా ఆదాయం పొందే చాన్స్..

Published : Mar 17, 2023, 05:59 PM ISTUpdated : Mar 17, 2023, 06:04 PM IST
మార్చి 31లోగా సీనియర్ సిటిజన్లు ఈ బ్యాంకుల్లో ఫి‌క్స్‌డ్ డిపాజిట్ చేస్తే అదనంగా ఆదాయం పొందే చాన్స్..

సారాంశం

FDలపై సీనియర్ సిటిజన్‌లకు బ్యాంకులు సాధారణం కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి FD పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, మీకు మార్చి 31, 2023 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాంటి స్కీంలను ఏఏ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుందాం. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది మన దేశంలో పాపులర్ బ్యాంకింగ్ స్కీం. బ్యాంకు నుంచి ప్రతి నెల స్థిరంగా వడ్డీ ప్రకారం రాబడి లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ తరహాలో FD లు స్టాక్ మార్కెట్ తో లింక్ ఉండదు. కాబట్టి ఇది రిస్క్ లేని పొదుపు ఎంపిక. ఇటీవలి కాలంలో ఆర్‌బిఐ రెపో రేట్ల పెంపుదల మధ్య బ్యాంకులు కూడా ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచాయి. దీని కారణంగా ఈ పథకాలు మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా మారాయి. అదే సమయంలో, కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లకు సాధారణం కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. అలాంటి FD పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, మీకు మార్చి 31, 2023 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాంటి స్కీంలను ఏఏ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుందాం. 

IDBI బ్యాంక్ స్పెషల్ FD : ప్రైవేట్ రంగ బ్యాంకు IDBI బ్యాంక్ "IDBI నమన్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్" పేరుతో ప్రత్యేక FDని నడుపుతోంది. ఈ పథకం ఏప్రిల్ 20, 2022న ప్రారంభించారు.  మార్చి 31, 2023 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రత్యేక FD కింద, సీనియర్ సిటిజన్లు వడ్డీపై 0.50 నుంచి 0.25 శాతం ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. ఈ FDలు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతాయి. అంటే మొత్తం లాభం 0.75 శాతం. మీరు ఈ FDలో కనిష్టంగా రూ. 10,000 మరియు గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 

SBI WeCare FD స్కీం : SBI WeCare FD స్కీం కింద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకం కూడా మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

SBI అమృత్ కలష్ పథకం: SBI ఫిబ్రవరి 15, 2023న “400 రోజుల స్కీం” అమృత్ కలష్ పేరుతో ఒక నిర్దిష్ట టర్మ్ స్కీమ్‌ను ప్రారంభించింది, ఇందులో సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం, సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటు ఉంటుంది. SBI ప్రకారం ఈ ప్రత్యేక FD కూడా మార్చి 31, 2023 వరకు యాక్టివ్‌గా ఉంటుంది.

HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ FD: HDFC బ్యాంక్ మే 18, 2020న సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్ “సీనియర్ సిటిజన్ కేర్ FD”ని ప్రారంభించింది. దీని గడువు కూడా 31 మార్చి 2023తో ముగియనుంది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD : ఇండియన్ బ్యాంక్ డిసెంబర్ 19, 2022న “ఇండ్ శక్తి 555 డేస్” పేరుతో ఒక ప్రత్యేక FDని ప్రారంభించింది. ఇది 31 మార్చి 2023 వరకు అమల్లో ఉండనుంది. ఈ ప్రత్యేక FDపై సీనియర్ సిటిజన్లు 7.50 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!