SBI PO: ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవాలా? ఇదిగో ప్రాసెస్

Published : Mar 01, 2025, 02:21 PM IST
SBI PO: ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవాలా? ఇదిగో ప్రాసెస్

సారాంశం

SBI PO: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో జాబ్స్ కి అప్లై చేశారా? అడ్మిట్ కార్డ్ వచ్చేసింది. మార్చి 24 లోపు ఈ కార్డు డౌన్ లోడ్ చేసుకోకపోతే లింక్ మీకు కనిపించదు. అడ్మిట్ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గా తెలుసుకోండి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను రిలీజ్ చేసింది. ఎగ్జామ్ కోసం అప్లై చేసిన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ sbi.co.in ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆఖరి తేదీ మార్చి 24, 2025. ఈ తేదీ తర్వాత లింక్‌ను పోర్టల్ నుండి తీసేస్తారు. అందుకే అభ్యర్థులు వెంటనే అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండి.

SBI ప్రాబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌ను మార్చి 8, 2025 నుండి మొదలు పెట్టి చాలా తేదీల్లో నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.  ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్‌లో రిలీజ్ అవుతాయని ఎస్బీఐ ప్రకటించింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో సక్సెస్ అయిన కాండిడేట్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ గాని, మే నెలలో గాని జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు కూడా మే, జూన్‌లోనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారు.

ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి 

SBI అఫీషియల్ వెబ్‌సైట్ sbi.co.in ను ఓపెన్ చేయండి. 
హోమ్‌పేజీలో “SBI PO అడ్మిట్ కార్డ్ 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ అవ్వడానికి మీ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయండి.
అక్కడ కనిపించే ఆప్షన్స్ లో SBI PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. 

ప్రిలిమ్స్ కు కొన్ని ముఖ్యమైన సూచనలు 

ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక ఫోటో ఐడీని తప్పకుండా తీసుకువెళ్లాలి. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లొచ్చు. ఫోటో ఐడీ లేకపోతే ఎగ్జామ్ హాల్‌లోకి రానీయరు. 

పీవో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గత సంవత్సరం డిసెంబర్ 27న మొదలైంది. అర్హులైన వారు జనవరి చివరి వరకు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడండి. 

 

PREV
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?