ఫెస్టివల్ సీజన్: కార్, పర్సనల్‌ లోన్లపై ఎస్‌బీఐ బంపరాఫర్లు

By Siva KodatiFirst Published Aug 20, 2019, 1:57 PM IST
Highlights

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న పండుగ సీజన్ సందర్భంగా బంపరాఫర్ ప్రకటించింది. దసరా, దీపావళీ పండుగలను పురస్కరించుకుని కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న పండుగ సీజన్ సందర్భంగా బంపరాఫర్ ప్రకటించింది. దసరా, దీపావళీ పండుగలను పురస్కరించుకుని కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది.

అలాగే కార్ల రుణాలపై 8.70 శాతం వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీ రేటుపై మరో 25 బీపీఎస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది.

అలాగే ఉద్యోగస్తులు కారు ఆన్-రోడ్డ ధరలో 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే కేవలం ఆరేళ్ల కాలపరిమితితో రూ.20 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చని.. దీనిపై 10.75 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా ఉద్యోగస్తులు యోనో యాప్ ద్వారా రూ. 5 లక్షల డిజిటల్ లోన్‌ను పొందవచ్చని వెల్లడించింది. 

click me!