నేటి నుంచే చౌకగా ఎస్బీఐ హోం లోన్స్

By rajesh yFirst Published Apr 10, 2019, 12:22 PM IST
Highlights

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హోం లోన్స్‌పై వడ్డీరేటు నేటి నుంచి స్వల్పంగా తగ్గనుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేపో రేటును పావుశాతం తగ్గించడంతో.. ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను 0.05శాతం తగ్గించింది. ఏప్రిల్ 10 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

రూ. 30లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీ రేటు 10బేసిస్ పాయింట్లు(0.10) తగ్గించడంతో ఈ రేటు శ్రేణి 8.70-9శాతం నుంచి 8.60-8.90శాతానికి చేరుకుంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులు హోం లోన్ రుణాలు చౌకగా పొందే అవకాశం ఏర్పడింది.

కాగా, ఆర్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దిశలో తీసుకున్న మూడవ బ్యాంక్ ఎస్బీఐ కావడం గమనార్హం. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం)లు 0.05శాతం కాల పరిమితి రుణ రేటును తగ్గించాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

click me!