ఎస్బీఐ ఏటీఎం కార్డ్ విత్‌డ్రా లిమిట్, ఛార్జీలు మీకు తెలుసా?

By rajesh yFirst Published Apr 13, 2019, 1:32 PM IST
Highlights

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా వినియోగదారులు రోజుకు రూ. 40,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అయితే రూ. 75,000 వరకు చేయవచ్చు. ఈ మేరకు బ్యాంక్ కార్పొరేట్ వెబ్‌సైట్ sbi.co.inలో పేర్కొంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు వివిధ రకాలైన ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను అందజేస్తోంది. క్లాసిక్ డెబిట్ కార్డ్, గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు వీటిలో ఉన్నాయి. ఈ ఏటీఎం కార్డుల ద్వారా వినియోగదారులు తీసుకునే సొమ్ముపై కొంత పరిమితి కూడా ఉంది.

ఉదాహరణకు ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా వినియోగదారులు రోజుకు రూ. 40,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అయితే రూ. 75,000 వరకు చేయవచ్చు. ఈ మేరకు బ్యాంక్ కార్పొరేట్ వెబ్‌సైట్ sbi.co.inలో పేర్కొంది. 

అంతేగాక, బ్యాంక్ అందిస్తున్న సేవలకు గానూ ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. ఏటీఎం/డెబిట్ కార్డులపై ఎస్బీఐ వసూలు చేస్తున్న ఛార్జీలను గమనించినట్లయితే.. 

క్లాసిక్ డెబిట్ కార్డుల కార్యకలాపాలపై పరిమితి: 

ఏటీఎంలో రోజుకు నగదు పరిమితి (డొమెస్టిక్):
కనీసం రూ. 100
గరిష్టం: రూ. 20,000

డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్/ఆన్‌లైన్ కార్యకలాపాల పరిమితి(డొమెస్టిక్):
కనీసం: ఏమీ లేదు
గరిష్టం: రూ.50,000

క్లాసిక్ డెబిట్ కార్డుల కార్యకలాపాలపై వసూలు చేసే ఛార్జీలు:

ఇస్సూరెన్స్ ఛార్జీలు: ఏమీలేవు
వార్షిక నిర్వహణ ఛార్జీలు: రూ.125(జీఎస్టీ అదనం)
కార్డ్ రిప్లేస్మెంట్ ఛార్జీలు: రూ. 300(జీఎస్టీ అదనం)

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులపై పరిమితి: 

ఏటీఎంలో డెయిలీ క్యాష్ లిమిట్(ఇంటర్నేషనల్): 

కనీసం: ఏటీఎంకు ఏటీఎంకు మారుతూ ఉంటుంది.
గరిష్టం: రూ. రూ. 40,000వేలకు సమానమైన విదేశీ కరెన్సీ

డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్/ఆన్‌లైన్ కార్యకలాపాల పరిమతి: 
కనీసం: పరిమితి లేదు
గరిష్టం: రూ.75,000

గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులపై ఛార్జీలు: 

ఇస్సూరెన్స్ ఛార్జీలు: ఏమీలేవు
వార్షిక నిర్వహణ ఛార్జీలు: రూ. 125(జీఎస్టీ అదనం)
కార్డ్ రిప్లేస్మెంట్ ఛార్జీలు: రూ. 300(జీఎస్టీ అదనం)
 

click me!