ఇండియాలో శాంసంగ్ భారీ పెట్టుబడులు.. 15 వేలలోపు స్మార్ట్‌ఫోన్ల తయారీ..

By Sandra Ashok KumarFirst Published Aug 17, 2020, 3:17 PM IST
Highlights

ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం కింద స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీ తన ఉత్పత్తి మార్గాలను విస్తృతం చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ చర్య వియత్నాంతో సహా ఇతర దేశాలలో ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఒక  నివేదికలో పేర్కొంది. 

ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం  శాంసంగ్  స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఇతర దేశాల నుండి భారతదేశానికి తరలించేందుకు యోచిస్తోంది. దక్షిణ కొరియా సంస్థ ఇండియాలో 40 బిలియన్ డాలర్లు అంటే  3 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఒక అంచనాను కూడా ప్రభుత్వానికి సమర్పించిందని నివేదించింది.

ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం కింద స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీ తన ఉత్పత్తి మార్గాలను విస్తృతం చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ చర్య వియత్నాంతో సహా ఇతర దేశాలలో ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఒక  నివేదికలో పేర్కొంది. చైనా తరువాత అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతిలో వియత్నాం ఒకటి.

పిఎల్‌ఐ పథకం కింద వచ్చే ఐదేళ్లలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని శామ్‌సంగ్ ప్రభుత్వానికి ఒక అంచనాను కూడా సమర్పించింది.

also read వరుసగా రెండవ రోజు పెరిగిన పెట్రోల్ ధర.. లీటరు ఎంతంటే ? ...

ముఖ్యంగా  రానున్న అయిదేళ్లలో 15వేల కంటే తక్కువ ధర ఫోన్‌లను ఉత్పత్తి చేయనుంది. దక్షిణ కొరియాలో కార్మిక ఖర్చులు ఎక్కువగా ఉన్నందున, దేశంలో ప్రొడక్షన్ మూసివేసే ప్రక్రియలో ఉంది. శాంసంగ్  బ్రెజిల్, ఇండోనేషియాలో కూడా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి కలిగి ఉంది.

శాంసంగ్  ప్రణాళికలను అనుసరిస్తు స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌ తన ప్రొడక్షన్స్‌లో కీలక భాగాన్ని భారత్‌కు తరలించనుంది. విలేకరుల సమావేశంలో కమ్యూనికేషన్స్, ఐటి మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ పిఎల్‌ఐ పథకానికి దేశీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారుల నుంచి అధిక స్పందన వచ్చిందని చెప్పారు.

"పిఎల్‌ఐ పథకం కింద మొత్తం 22 కంపెనీలు దరఖాస్తులను దాఖలు చేశాయి. మేము ఆపిల్, శామ్సంగ్ కంపెనీలను భారతదేశానికి స్వాగతిస్తున్నాము అని ఐటి మినిస్టర్ అన్నారు.

click me!