Samsung Galaxy M34 5G: శాంసంగ్ నుంచి కొత్త 5G ఫోన్లు విడుదలకు సిద్ధం..ధర ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

By Krishna AdithyaFirst Published May 12, 2023, 5:40 PM IST
Highlights

Samsung కంపెనీ Galaxy M-Series, F-Series రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. 

Samsung తన Galaxy M-Series, F-Series  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. Samsung Galaxy M34 5G, Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్‌లు మిడ్ రేంజ్ ఫోన్ల విభాగంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గెలాక్సీ A34 5G మోడల్ కంటే ఈ ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అంతా భావిస్తున్నారు. ఈ మోడల్ ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ఇది ముఖ్యమైన ధృవీకరణ. ఈ రెండు సామ్‌సంగ్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G, F34 5Zu స్మార్ట్‌ఫోన్‌లు రాబోయే వారాల్లో భారతదేశం కాకుండా ఇతర మార్కెట్‌లలో విడుదల కానున్నాయి. ఈ రెండు పరికరాలు BIS వెబ్‌సైట్‌లో కనిపించాయి.. Galaxy M34 మోడల్ నంబర్ SM-M346B/DS, Galaxy F34 5G మోడల్ నంబర్ SM-E346B/DS గా పేర్కొన్నారు.  BIS లిస్టింగ్ నుండి ఈ రెండు Samsung ఫోన్‌ల గురించి ఎటువంటి అదనపు సమాచారం లభించలేదు. అయితే తాజా ట్రెండ్‌ను పరిశీలిస్తే, గెలాక్సీ ఎమ్, ఎఫ్ సిరీస్‌లకు చెందిన ఈ ఫోన్‌లకు ఏ-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే స్పెసిఫికేషన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G 6.6-అంగుళాల ఫ్లాట్ AMOLED ఫుల్ HD+ రిజల్యూషన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ 120 Hz. డిస్‌ప్లేలో ముందు కెమెరా కోసం స్క్రీన్‌పై వాటర్‌డ్రాప్ నాచ్ ఇవ్వబడింది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. ఈ Samsung ఫోన్ Android 13 ఆధారిత One UI 5 తో వస్తుంది.

Samsung Galaxy A34 5G ఒక మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్. మీడియాటెక్ డైమెన్షన్ 1080 ప్రాసెసర్ హ్యాండ్‌సెట్‌లో ఇవ్వబడింది. ఫోన్ 8 GB RAM ,  256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. Galaxy A34 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. హ్యాండ్‌సెట్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో OIS మద్దతుతో, 5-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

 

click me!